వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలున్నారు. టిడిపి నుంచి న‌లుగురు, జ‌న‌సేన నుంచి ఒక‌రు తోడ‌య్యారు. మొత్తంగా 156 మంది ఉంటే..టిడిపిలో ఉన్న‌ది 19 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. అందులో ప్ర‌తిప‌క్ష‌నేత త‌న‌ని అవ‌మానించిన కౌర‌వ‌స‌భ‌కి రాన‌ని బాయ్ కాట్ చేశారు. అంటే 18 మంది ఎమ్మెల్యేలే. వీరి ప్ర‌శ్న‌ల‌కి కూడా స‌మాధానాలు ఇవ్వ‌లేని స్థితిలో ఉన్న స‌ర్కారు స‌స్పెన్ష‌న్ల‌కి తెగ‌బ‌డింది. అవినీతి, రాజ్యాంగ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌న్నింటినీ క‌డిగి పారేస్తున్న పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్, పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుల‌ను స‌స్పెండ్ చేశారు. మిగిలిన టిడిపి ఎమ్మెల్యేల‌నూ స‌స్పెండ్ చేసినా, బడ్జెట్ సమావేశాల్లో బొక్కలు బయట పడతాయని, పయ్యావుల, నిమ్మలని సెషన్ మొత్తం సస్పెండ్ చేయించింది జ‌గ‌నేన‌ని అసెంబ్లీ లాబీల్లో టాకు వినిపిస్తోంది. పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసిన వెంట‌నే వారు త‌మ స్పంద‌న‌ని తెలియ‌జేశారు. శాసనసభ సమావేశాలు ముగిసేంతవరకు సస్పెన్షన్ వేటు వేయ‌డంతో బ‌డ్జెట్ స‌మావేశాల‌లో స‌ర్కారు బొక్క‌లు బ‌య‌ట‌పెడ‌తార‌నే భ‌యంతోనే మిగతా సభ్యుల్ని ఈ ఒక్కరోజు సస్పెండ్ చేసిన స్పీకర్, వీరిద్దరినీ సెష‌న్స్ మొత్తానికి స‌స్పెండ్ చేశారు. సీట్లో నుంచి కదలని త‌న‌ను సస్పెండ్ చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంద‌ని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింహం సింగిల్ గా వస్తుందని చెప్పుకునే వారు మా సభ్యులకు సమాధానం చెప్పలేక సస్పెన్షన్ మార్గం ఎంచుకుంటున్నార‌ని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం చెప్పించిన అసత్యాలు అసెంబ్లీలో ఆధారాలతో సహా ఎండగడతామనే త‌మ‌ని సస్పెండ్ చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read