పల్నాడులో వైసీపీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ నానాటికీ వికృతరూపం దాల్చాయి. ఇటీవల బాదుడే బాదుడు కార్యక్రమానికి వెళ్లిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి లక్ష్యంగా వైసీపీ ఎటాక్ చేసింది. టిడిపి నేతల ఇళ్లు, కార్లు, ఆస్తులు ధ్వంసం చేశారు. అయితే పోలీసులు బాధితులైన టిడిపి నేతలపైనే కేసులు కట్టారు. ఆధారాలతో ఫిర్యాదులు చేసినా వైసీపీ నేతలని వదిలేశారు. బ్రహ్మారెడ్డిని తన ట్రాక్టర్‌పై ఊరేగించాడనే కక్షతో ఆ రైతు ట్రాక్టర్ తగలబెట్టేయడం పల్నాడులో వైసీపీ అరాచకాలకు పరాకాష్ట. తాజాగా బ్రహ్మారెడ్డి వెల్లడించిన మరో అంశం వింటే..అసలు ఏపీలోనే ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా అనే అనుమానం రాక మానదు. కొన్ని నెలల కిందట నిదానంపాడు అమ్మవారి గుడికి బ్రహ్మారెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి పూజారి బ్రహ్మారెడ్డిని ఆశీర్వదిస్తూ పూజలు చేశారు. ఆ పూజారిని ఇప్పుడు సస్పెండ్ చేశారు. గుడికి వెళ్లిన ప్రతివాడికి ఆశీర్వాదం ఇవ్వడం పూజారి బాధ్యత అని, అటువంటిది తనని ఆశీర్వదించారని పూజారిని వైసీపీ నేతలు సస్పెండ్ చేయించారంటే ఎంత భయంకరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని జూలకంటి బ్రహ్మారెడ్డి వ్యాఖ్యానించారు.
పల్నాడులో వైసీపీ పగ..జూలకంటి బ్రహ్మారెడ్డిని ఆశీర్వదించిన పూజారిపై చర్యలు
Advertisements