ఇద్దరు ఆత్మ పరమాత్మ లాగా ఉండేవారు.‌ ఆయన తప్పుడు లెక్కలు రాస్తే, ఈయన లెక్క వెనక వేసుకునే వాడు. అక్రమాస్తుల కేసుల్లో ఒకరు ఏ1 అయితే, ఇంకొకరు ఏ2. పార్టీలోను ఒకరు సీఎం అయితే, ఇంకొకరు డిఫాక్టో సీఎం. వీరే జగన్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి. చాలా రోజులుగా ఇదే అందరికీ తెలిసిన విషయం.కాలంలో జైలులో, బెయిల్ లోనా వీడని బంధం. కానీ ఇటీవల  ఇద్దరు దూరమయ్యారని సమాచారం. వరస కేసుల్లో, విషాదాలలో తన కుటుంబ సభ్యులు ఇరుక్కుపోవడంతో సాయి రెడ్డి ఒంటరి అయ్యారు. వైకాపా నుంచి కనీస మద్దతు లేదు. దీంతో సాయి రెడ్డి పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టన్నట్టు ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి గ్యాప్ బయటపడింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో ఓటింగ్‍కు దూరంగా విజయసాయి డుమ్మా కొట్టారు. విశాఖలో తన ఓటును నమోదు చేసుకున్న విజయసాయిరెడ్డి పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి కూడా ఆసక్తి చూపించలేదు. వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గా నియమించడంతో అలక బూనిన సాయిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికీ దూరంగా ఉన్నారు. ఇటీవల తారకరత్న అంత్యక్రియల సమయంలో చంద్రబాబుతో విజయసాయి చనువుగా ఉండటంపై జగన్ ఆగ్రహం చేసినట్లు తెలిసింది.  ప్రెస్‍మీట్ పెట్టి చంద్రబాబు, లోకేష్‍కు వ్యతిరేకంగా మాట్లాడాలని  జగన్ రెడ్డి ఆదేశించినా పట్టించుకోకుండా ఢిల్లీకి వెళ్లిన విజయసాయిరెడ్డి వైసీపీకి దూరం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read