ఇదేదో పురాణ కథలు కాదు..ఏపీలో చిత్రాలు..ప్రజాస్వామ్య వ్యవస్థని నడిరోడ్డుపై నగుబాటుకి గురిచేసిన వైసీపీ ఎన్నికల లీలలు. పట్టభద్రుల ఎన్నికల కోసం వైసీపీ చేర్పించిన ఓట్లు చూస్తుంటే విపక్షాలే కాదు, సామాన్య ప్రజలు కూడా గుండెలు బాదుకుంటున్నారు. రాయలసీమలో, ముఖ్యంగా జగన్ రెడ్డి అత్యంత ముఖ్యంగా భావించే పెద్దిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఉండే ప్రాంతాల్లో ఈ అరాచక ఓట్ల నమోదు జరిగింది. గతంలో తిరుపతి ఉప ఎన్నిక, కుప్పం మున్సిపల్ ఎన్నికలకి పెద్ద ఎత్తున టూరిస్టు ఓటర్లని దింపిన వైసీపీ పెద్దలు ఈ సారి ఏకంగా వేలసంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించారు. తిరుపతిలో ఓటర్ల లిస్టులని పరిశీలించిన విపక్ష నేతలు వైసీపీ బరితెగింపు చూసి నోరెళ్లబెట్టారు. ఓటర్ల లిస్టులు పట్టుకుని టిడిపి నుంచి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, సీపీఐ నుంచి నారాయణ డోర్ టు డోర్ వెళితే..దొంగ ఓటర్లు వేలసంఖ్యలో బయటపడ్డారు. తిరుపతి ఒక డోర్ నెంబర్‌లో 18కి పైగా ఓట్లు నమోదు అయ్యాయి. అయితే ఈ ఓటర్లందరికీ ఒకామె భార్యగా నమోదు చేసి దొరికిపోయారు. ఇంకో డోర్ నెంబర్‌కి వెళితే అది చికెన్ సెంటర్. అందులో 36 ఓట్లున్నాయి. అవి కూడా ముస్లిం, హిందూ, క్రిస్టియన్లు కలిసి వున్నట్టు నమోదు చేశారు. ఇంకో డోర్ నెంబర్‌లో ఏ మణికంఠ పేరుతో 11 ఓట్లు నమోదు అయ్యాయి. ఏ మణికంఠకి ప్రతీ ఓటుకి తండ్రి మారిపోయాడు. ఏ తండ్రికీ ఇంటి పేరు ఏ లేదు. ఇవీ వైసీపీ మార్కు దొంగ ఓటర్లచిత్రాలు. అసలు చదువుకోని వాళ్లకి పట్టభద్రుల ఓట్లు ఎలా వచ్చాయో తెలియని మరో విచిత్రం. తిరుపతిలోని యశోదనగర్ 18-1- 90/12 నంబరు గల ఖాళీ ప్రదేశంలో 10 దొంగ ఓట్లు, ఒక వలంటీర్ ఇంట్లో 12 దొంగ ఓట్లు, సీపీఎం ఆఫీస్ పక్కన గల లక్ష్మీ ఇంట్లో 8 దొంగఓట్లు ఉన్నట్లు సీపీఐ నేతలు గుర్తించారు.తిరుపతి నగరంలోనే 7 వేల దొంగ ఓట్లు ఉన్నట్లు సీపీఐ ఆరోపిస్తోంది. తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో వేలాది దొంగ ఓట్లను అధికార వైసీపీ నమోదు చేసిందని టిడిపి నేతలు అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. విపక్షాలన్నీ దొంగ ఓట్లపై ఆధారాలపై ఫిర్యాదులు చేస్తుంటే, వైసీపీ స్పందనతో అవి తమ ఘనతే అని చాటుకున్నట్టుంది. ఎన్నికలలో ఓటమి ఖాయం అని తెలిసే ఇలా దొంగ ఓట్ల ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అంటోంది. వలంటీర్లు నమోదు చేయించిన దొంగ ఓట్లను ఆధారాలతో సహా బయటపెట్టినా వాటిపై స్పందించడంలేదంటే, అది తమ పనేనని ఒప్పుకున్నట్టు స్పష్టం అవుతోంది.
రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా, మళ్ళీ అదే తిరుపతి ఫార్ములా... బటన్ నొక్కుడు మీద నమ్మకం లేదా ?
Advertisements