jagan vizag 16032023

గ‌తంలో తెలుగు రాష్ట్రాల్లో దెయ్యం తిరుగుతోంద‌ని వార్త‌లు విప‌రీతంగా ప్ర‌చారం అయ్యాయి. ఆ దెయ్యం కూడా స్త్రీ అని, ప్ర‌తీ ఇంటి త‌లుపుపై ఓ స్త్రీ రేపురా అని రాసేస్తే, దెయ్యం వ‌చ్చి రేపు ర‌మ్మంటున్నార‌నుకుని వెళ్లిపోతుంద‌ని తెగ పుకార్లు పుట్టించారు. ఏ గోడ, ఏ త‌లుపు చూసినా `ఓ స్త్రీ రేపు రా` రాత‌ల‌తో నిండిపోయాయి. సీఎం జ‌గ‌న్ రెడ్డి విశాఖ రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌లూ ఓ స్త్రీ రేపు రా పుకార్ల‌నే త‌లపిస్తున్నాయి. సీఎం ఎక్క‌డుంటే అక్క‌డ రాజ‌ధాని అంటుంటారు జ‌గన్ రెడ్డి. అంటే తాను విశాఖ‌లో ఉంటానని, అదే రాజ‌ధాని అని చెప్ప‌క‌నే చెబుతుంటారు. మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్ మార్చి నుంచి విశాఖ రాజ‌ధాని అని ప్ర‌క‌టిస్తారు. ఉత్త‌రాంధ్ర వైసీపీ వ్య‌వ‌హారాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి మార్చిలో సీఎం విశాఖ నుంచే ప‌రిపాల‌న సాగిస్తార‌ని చెబుతుంటే, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న‌దైన శైలిలో ప్ర‌తీ నెలా విశాఖ రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌లు త‌న‌దైన భాషా పాండిత్యంలో చేస్తుంటారు. తాజాగా సీఎం కేబినెట్ మీటింగ్‌లో జూలై నుంచి విశాఖ‌లోనే ఉంటాన‌ని చెప్పార‌ట‌. దాదాపు రెండేళ్లుగా ఇదే గంద‌ర‌గోళం. మూడు రాజ‌ధానులు అని ఒక‌సారి, విశాఖే ఏకైన రాజ‌ధాని అని మ‌రోసారి, ప్ర‌తీ పండ‌గ‌కి విశాఖ నుంచే ప‌రిపాల‌న అంటూ ప్ర‌తీసారి ప్ర‌క‌టించిన మంత్రులు, ప్ర‌భుత్వ పెద్ద‌లు బ‌కరాలు అవ్వ‌డం త‌ప్పించి..మారిందీ లేదు. మార్చిందీ లేదు. గ‌త ఏడాది ఉగాది అన్నారు. వినాయ‌క‌చ‌వితి, దీపావ‌ళి, ద‌స‌రా పండ‌గ‌ల‌కి విశాఖ నుంచే ప‌రిపాల‌న స్టేట్మెంట్లు ఇచ్చారు. మ‌ళ్లీ ఈ ఏడాది సంక్రాంతి నుంచి రాజ‌ధాని విశాఖ పాట అందుకున్నారు. ఇది రోజూ విని, చూసి విసిగిపోయిన జ‌నాలు ``ఓస్త్రీ రేపు రా`` టైపులోనే వ‌చ్చేనెల‌లో విశాఖ రాజ‌ధాని అని రాసుకోవ‌డ‌మే అని సైటైర్లు వేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read