ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం చదువు పెద్దగా లేదు కానీ కబ్జాల విషయంలో అనకొండని మించిపోతాడని ఆరోపణలు ఉన్నాయి. ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీకి చెందిన వందల ఎకరాలు కారు చౌకగా కొట్టేశాడని హోరెత్తిపోయింది. జగన్ రెడ్డి సర్కారు కనీసం విచారణ కూడా జరపలేదు. అయితే కేంద్ర ఆదాయ పన్నుశాఖ మాత్రం మంత్రిపై ఓ కన్ను వేసింది. గతంలోనూ కార్మికశాఖ మంత్రిగా బెంజ్ కారు లంచంగా తీసుకున్నారనే టిడిపి ఆధారాలో సహా బయటపెట్టింది. అయినా మంత్రిపై చర్యలు శూన్యం. తాను లాగేసుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తానని కొద్దిరోజుల క్రితం మంత్రి ప్రకటించారు. ఈ భూముల కొనుగోలులో జరిగిన భారీ డబ్బు లావాదేవీలపై ఐటీ శాఖ గతంలో నోటీసులు ఇచ్చింది. దీనిని మంత్రి పట్టించుకోలేదు. దీంతో రెండోసారి ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. ఇట్టినా భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఈనెల 17 లోపు తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొంది. ఏప్రిల్ 3న జరిగే వీడియో కాన్ఫరెన్సుకి తప్పక హాజరుకావాలని జయరాం, ఆయన భార్యకు ఐటీ నోటీసులు జారీ చేసింది. మంత్రి నియోజకవర్గం పరిధిలో ఇట్టినా ప్లాంటేషన్ పేరుతో రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి కార్యకలాపాలు ఆరంభించలేదు. ఇది పసిగట్టిన మంత్రి ఇట్టినా కంపెనీలో ఓ వాటాదారుడిని లైనులో పెట్టుకుని అక్రమంగా భూములు లాగేసుకున్నారని ఆరోపణలున్నాయి. ఇట్టినాకి చెందిన 450 ఎకరాల భూమిలో వందెకరాలు కొన్నది వాస్తవమేనని మంత్రి గుమ్మనూరు జయరాం కూడా అంగీకరించారు. వీటిని తిరిగి రైతులకు మార్కెట్ ధర ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పారు.
మంత్రి జయరాంకి భారీ షాక్ ఇచ్చిన ఐటీ శాఖ.. వైసీపీని వెంటాడటం కేంద్రం మొదలు పెట్టిందా ?
Advertisements