వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌కేసులో ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ విచార‌ణ‌ని స్పీడు చేసింది. ఒక క‌న్ను మ‌రొక క‌న్నుని ఎందుకు పొడుస్తుంద‌ని ప్ర‌శ్నించిన వైఎస్ జ‌గ‌న్ చుట్టూ ఉన్న మ‌నుషుల‌కే సీబీఐ విచార‌ణ‌కి ర‌మ్మంటూ నోటీసులు ఇవ్వ‌డం ఈ కేసు త్వ‌రలోనే తేలిపోనుంద‌ని స‌మాచారం. తాజాగా రేపు మరోసారి సిబిఐ విచారణకు కావాలని అవినాష్ రెడ్డికి పిలుపు వచ్చింది. స్వయంగా ఇంటికి వెళ్లి సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు కచ్చితంగా రావాల్సిందే అని, ఎలాంటి కారణాలు చెప్పవద్దని గట్టిగా చెప్పారు. ఇక మరో పక్క,  పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను కడపలో సీబీఐ అధికారులు విచారించారు. హ-త్య జరిగినరోజు వివేకా ఇంటికి ఎందుకు వ‌చ్చార‌ని, ఎంపీ అవినాష్రెడ్డితో ఫోటో దిగిన విషయంపైనా సీబీఐ సుధాకర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైఎస్ అవినాశ్ రెడ్డి, జ‌గ‌న్ రెడ్డి, భార‌తి రెడ్డికి అత్యంత స‌న్నిహితులైన వారిలో ఎక్కువ‌మందిని  సీబీఐ విచారణకు పిలిచింది. ఇప్ప‌టికే రెండు సార్లు సీబీఐ విచార‌ణ‌ని ఎదుర్కొన్న ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని  నెల 12న ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్‌ జైలులోని అతిథిగృహానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. సీబీఐ అధికారుల జోరు చూస్తుంటే తొంద‌ర‌లోనే వివేకా కేసులో సూత్ర‌ధారులు, పాత్ర‌ధారులంద‌రినీ తేల్చేసేలా క‌నిపిస్తోంది.  గతంలో విచారణకు పిలిచిన సీఎం జగన్ రెడ్డి ఓఎస్ డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం భార్య భార‌తి రెడ్డి పీఏ నవీన్ లను మ‌రోసారి విచారణకు పిలిచార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గూగుల్ టేకౌట్‌, కాల్ లిస్ట్ ఆధారంగా విచార‌ణ చేస్తున్న సీబీఐ, హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో వివేకానంద‌రెడ్డి ఇంటి నుంచి..అవినాష్ రెడ్డి ఇంటికి..తాడేప‌ల్లిలో సీఎం జ‌గ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లిన కాల్స్‌పై దృష్టి సారించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read