పెద్దపెద్ద వాళ్లు సైతం పదవుల కోసం పైరవీల బాట పడుతున్నారు. అటువంటి సమయంలో పిలిచి పదవి ఇస్తే సున్నితంగా తిరస్కరించి తన పెద్దరికాన్ని-సింప్లిసిటీని చాటుకున్నారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరికోరి కట్టబెట్టిన టీటీడీ ధర్మప్రచార పరిషత్ సలహాదారుడి పదవిని చాగంటి తిరస్కరించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అవసరం లేరని చాగంటి తేల్చి చెప్పారు. నా ఊపిరే వెంకటేశ్వరస్వామి అని చాటిచెప్పారు. టీటీడీకి నా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ముందు ఉంటానని ప్రకటించారు. తనకు కట్టబెట్టిన పదవి పట్ల చాగంటి మొదటి నుంచీ అంత ఆసక్తిగా లేరు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో దశాబ్దాల కాలం పనిచేసిన అనంతరం తెలుగు ప్రజలకు ప్రముఖ ప్రవచనకర్తగా డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు సుపరిచితులు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ధార్మిక ప్రచారంలో తలమునకలయ్యే చాగంటికి పదవి కట్టబెట్టడం ద్వారా హిందూ వ్యతిరేకి అనే ముద్రని పోగొట్టుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నం అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ రెడ్డి ఆదేశాలతో టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ నెల క్రితమే టిటిడి సలహా మండలి నిర్ణయం తీసుకుంది. అయితే బాధ్యతలు చేపట్టని చాగంటి కోటేశ్వరరావు ఆ పదవినే తిరస్కరించడం ఇప్పుడు సంచలన వార్త అయ్యింది. రాజకీయాల జోలికి వెళ్లని చాగంటి, ఈ పదవి తీసుకోవడం ద్వారా తనపై పొలిటికల్ ముద్ర పడుతుందనే పదవికి దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట
జగన్ ఆఫర్ చేసిన సలహాదారు పదవి తిరస్కరించి, సంచలన వ్యాఖ్యలు చేసిన చాగంటి కోటేశ్వరరావు..
Advertisements