పీపుల్స్ పల్స్ పొలిటికల్ రీసెర్చ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు ఎస్టీ నియోజవకర్గాల్లో ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించగా వైసీపీ 6, టిడిపి 1 గెలవచ్చని అంచనా వేసింది. ఈ పీపుల్స్ పల్స్ సంస్థ ఎవరిదో కాదు..వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆంతరంగికుడుగా, జగన్ సాక్షిలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి. ఆయన చేసిన పీపుల్స్ పల్స్ పొలిటికల్ రీసెర్చ్ సంస్థ ట్రాకర్ పోల్ సర్వే పేరుతో ఫలితాలు విడుదల చేశాడు. ఎంత స్వామి భక్తి చాటుకున్నా వైసీపీ గెలవలేదని ఇచ్చిన లెక్కలే తేల్చేశాయి. ఏడు గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీకి 44.25 శాతం, టిడిపికి 39.39 శాతం, జనసేన 8.19 శాతం ఓట్లు వస్తాయని ప్రకటించారు. టిడిపి జనసేన పొత్తు ఉందని వైసీపీ వాళ్లే చెబుతున్నారు. రెండూ కలిసి పోటీచేస్తే ఈ సర్వే ప్రకారం చూసినా వైసీపీకి 44.25 శాతం, టిడిపి+జనసేనకి 47.58 శాతం (టిడిపి 39.39+జనసేన 8.19 ) ఓట్లు పోలవుతున్నాయి. అంటే 2019లో ఈ ఏడు నియోజకవర్గాలలో ఒక్కటి గెలవని టిడిపి జనసేన పొత్తుతో వైసీపీకి కంటే 3 శాతం అధిక ఓట్లతో సీట్లన్నీ గెలుచుకోబోతోందని వైసీపీ సానుభూతి చేసిన సర్వేనే తేటతెల్లం చేయడం విశేషం. వైసీపీ కోసం వైఎస్ కుటుంబ అభిమాని పీపుల్స్ పల్స్ సంస్థతో చేయించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏడు నియోజకవర్గాల్లో టిడిపికి సగటున దాదాపు 9.6 శాతం ఓట్లు అధికంగా వస్తున్నాయి. జనసేనకి ఏడు నియోజకవర్గాల్లో సరాసరి వచ్చే 8.19 శాతం వచ్చే ఓటింగ్ని కలిపితే దాదాపు 17 శాతం అదనపు ఓట్లు టిడిపి అలయెన్స్ కొల్లగొట్టనుంది. అంటే గత ఎన్నికల్లో వచ్చిన 39 శాతం+ పెరిగిన 17 శాతం ఓటింగుతో వైసీపీ అత్యంత బలంగా ఉందని భావించే ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వైసీపీ సర్వేనే వెల్లడించడం రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతకి అద్దం పడుతోంది.
వైసీపీ సానుభూతిపరుల సర్వేలోనే ఎస్టీ నియోజకవర్గాలన్నీ పోతున్నాయి.. టిడిపి జనసేన కలిస్తే ఏడు ఎస్టీ నియోజకవర్గాలు క్లీన్ స్వీప్
Advertisements