తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ ఎందుకు మార్చారో తెలియదు కానీ, ఈ పార్టీ ఏపీలో పనిచేసేది మాత్రం జగన్ వైసీపీకి లాభం చేకూర్చడానికేనన్నది మాత్రం స్పష్టమైందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకంగా మారడంతో అవి టిడిపి-జనసేనకి పడకుండా చూసే బాధ్యతని బీఆర్ఎస్ తీసుకుందని నిర్ణయాలు తేటతెల్లం చేస్తున్నాయి. కాపులకి టిడిపి ఇచ్చిన రిజర్వేషన్ తీసేయడం, కాపు కార్పొరేషన్ కి నిధులు ఇవ్వకపోవడంతో గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన కాపులు కూడా దూరం అయ్యారు. ఈ ఓట్లు టిడిపికి వెళ్లినా, జనసేనకి పడినా చాలా సీట్లు వైసీపీ కోల్పోతుంది. ఈ పరిస్థితి నుంచి వైసీపీని గట్టెక్కించడానికి కేసీఆర్ బీఆర్ఎస్ ని రంగంలోకి దింపారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీపై కోపంగా వున్న కాపునేతలు, ఓటర్లు ఎవరూ టిడిపి, జనసేన వైపు వెళ్లకుండా బీఆర్ఎస్లోకి ఆకర్షించడమే కేసీఆర్ ప్లాన్ అని తెలుస్తోంది. తాజాగా ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాపు నేతలు హైదరాబాద్లో సమావేశం అయ్యారు. టిడిపిలోనే కొనసాగుతానని మొన్ననే చంద్రబాబుని కలిసొచ్చిన గంటా శ్రీనివాసరావు, బీజేపీ అధిష్టానం తీరుతో గుర్రుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణలు ఈ భేటీలో ఉన్నారు. మరోవైపు కాపు జాతి ప్రముఖులైన ముద్రగడ పద్మనాభం వంటి వారు ఎలాగూ వైసీపీ కోసం పనిచేసేవారే. మరికొందరిని కూడా బీఆర్ఎస్లో చేర్చాలని కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ మేరకు తోట చంద్రశేఖర్ ఏపీలో కాపు నేతలతో మంతనాలు సాగిస్తున్నారని సమాచారం.
టిడిపి-జనసేన వైపు కాపులు వెళ్లకుండా జగన్ కోసం కేసీఆర్ వ్యూహం పన్నారా ?
Advertisements