వైఎస్ వివేక కేసులో సిబిఐ దూకుడు పెంచింది. కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తూ, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలిసిందే. అలా కేసు హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యిందో లేదో, ఇలా కేసులో కదలిక వచ్చింది. ఎప్పటి నుంచో, కడప ఎంపీ, జగన్ తమ్ముడు అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు ఇస్తుంది అంటూ, ప్రచారం సాగింది. విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారని, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రచారం జరిగిన ప్రతి సారి, ఏదో ఒక వంకతో, సిబిఐ ముందుకు వెళ్ళలేక పోయింది. అయితే ఈ సారి మాత్రం, సిబిఐ సైలెంట్ గా పని కానిచ్చేసింది. రెండో కంటికి తెలియుకుండా, సైలెంట్ గా, అవినాష్ రెడ్డికి నోటీసులు పంపించింది. నోటీసులు పంపించిన తరువాత మీడియాకు చెప్పింది. అయితే దీని కంటే ముందు, నిన్న ఉదయం, సిబిఐ పులివెందులలో, అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాలు పరిశీలించి, అక్కడ కొంత సమాచారం సేకరించింది. సాయంత్రానికి నోటీసులు ఇచ్చింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీస్ కు, విచారణకు రావాలి అంటూ, సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే నిన్న ఈ వార్త వచ్చిందో లేదో, అవినాష్ రెడ్డి వెంటనే స్పందించారు. తాను ఈ రోజు విచారణకు రాలేనని ట్విస్ట్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే తనకు అనేక కార్యక్రమాలు ఉన్నాయని,  ఐదు రోజులు సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. మరి దీని పై సిబిఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. సహజంగా సిబిఐ నోటీసులు వరకు వెళ్ళింది అంటే, అరెస్ట్ తప్పదేమో అనే ప్రచారం జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read