ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి వైసీపీ స‌ర్కారు నోటీసులు ఇవ్వ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌భుత్వంపై ఉద్యోగులు గవర్నర్‍కు ఫిర్యాదు చేయ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ముఖ్య‌మంత్రి చాలా సీరియ‌స్‌గా ఉన్నార‌ని తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌తో  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును ర‌ద్దు చేసే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. జారీ చేసిన నోటీసుల్లో సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని పేర్కొన‌డంతో ఒక్క‌సారిగా సంఘ నేత‌లు ఉలిక్కిప‌డ్డారు. ఇటీవ‌లే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు  రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి.  12వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిందని ఉద్యోగుల జిపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం 500 కోట్లు డ్రా చేసిందని ఉద్యోగ‌సంఘాలు ఆరోపించాయి. ఉద్యోగుల ఫిర్యాదుపై గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వాన్ని వివ‌ర‌ణ అడ‌గ‌డంతో ర‌చ్చ మొద‌లైంది. ఉద్యోగ‌సంఘాల‌లో ఏపీ ఎన్జీవో, స‌చివాల‌య ఉద్యోగులు సంఘం, రెవెన్యూ స‌ర్వీసెస్ వైసీపీ స‌ర్కారు చెప్పుచేత‌ల్లో ఉన్నాయి. ఒక్క ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం ఇలా గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కి వెళ్లి ఫిర్యాదు చేయ‌డంపై స‌ర్కారు గుర్రుగా ఉంది.  ప్ర‌భుత్వంపై ప్ర‌భుత్వ ఉద్యోగులు గ‌వ‌ర్న‌ర్కి ఫిర్యాదు చేయ‌డం దేశంలోనే తొలిసారి. ఇప్ప‌టికే అన్నిరంగాల్లో ఏపీ ప‌రువు పోయింద‌ని, ప్ర‌భుత్వ ఉద్యోగులు రోడ్డెక్క‌డంతో మ‌రీ డ్యామేజీ అయ్యామ‌ని వైసీపీ పెద్ద‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘాన్నే ర‌ద్దు చేసేందుకు పావులు క‌దుపుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read