బ్రిటిష్ కాలం నాటి (1861) చట్టంని ఉపయోగించి ఏపీ సర్కారు తెచ్చిన జీవో 1పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఈ జీవోని హైకోర్టు సస్పెండ్ చేయడంతో సుప్రీం కోర్టులో జగన్ సర్కారు వేసిన పిటిషన్‌పై విచారణని ముగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోము అని స్పష్టం చేసిన ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. కేసు తదుపరి విచారణను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపడుతుందని పేర్కొంది. ఈనెల 23న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టాలని సిజెఐ ఆదేశించారు. వాద ప్రతివాదులు ఇరువురు అన్ని అంశాలను డివిజన్ బెంచ్ ముందు ప్రస్తావించుకోవచ్చని పేర్కొన్నారు. అన్ని అంశాలు ఓపెన్‌గా ఉంచుతున్నామన్న సిజెఐ, కేసు మెరిట్స్‌పై ఇప్పుడు ఎలాంటి విచారణ చేపట్టడం లేదని తేల్చి చెప్పారు. శీతాకాల సెలవుల్లో ఉన్న ధర్మాసనం ఈ కేసుని టేకప్ చేయడం, దాని విచారణ పరిధిపై రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం లేవనెత్తారు. దీనికి ప్రతివాదుల తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు.
జీవో నంబర్ 1 పై, సుప్రీం కోర్టులో వైసీపీకి చావు దెబ్బ..
Advertisements