టిడిపి ఎంపీగా కేశినేని నాని నిత్య‌మూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఈ మధ్య వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉంటున్నారు. కేశినేని నాని ఎందుకో ఈ మధ్య తరుచూ టిడిపి అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది పార్టీలో వ్య‌వ‌హారం. ఇక కుటుంబంలో అయితే త‌న త‌మ్ముడు చిన్నీ అంటే ప‌డ‌దు అనేది ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న సొంత పార్టీ ప్ర‌త్య‌ర్థులు ఎలాగూ ఉన్నారు. కృష్ణా జిల్లా టిడిపిలో ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌తోనూ కేశినేని నానికి స‌ఖ్య‌త లేదు. ఆ నేతలు తనకు సమాన హోదా కాదని, తనది ఢిల్లీ రేంజ్ అని కేశినేని నానినే చెప్పారు. మొత్తానికి ఈ మధ్య చూస్తున్న ప్రెస్ మీట్లు నిత్య అసంతృప్తివాదిగా కేశినేని నాని ముద్ర‌ప‌డ్డారు. కేశినేని ట్రావెల్స్ పేరుతో వ్యాపార‌రంగంలో ఉన్న నాని 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. అక్కడ విధానాలు నచ్చలేదని, ఏడాది కూడా పార్టీలో లేకుండా 2009 లో టిడిపి గూటికి వ‌చ్చాడు. తెలుగుదేశం పార్టీలో వ‌చ్చిన నుంచీ నిత్య‌మూ పార్టీలో నేత‌ల‌పై ఏదో ఒక వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఈ మ‌ధ్య టిడిపి అధినేత చంద్ర‌బాబుకి బొకే ఇవ్వ‌నంటూ నానీ హావభావాలు వైరల్ అయ్యాయి. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ మేయ‌ర్ అభ్యర్థిగా కుమార్తెని టిడిపి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టింపజేసుకున్న నాని...పార్టీలో నేత‌ల‌ను క‌లుపుకుని వెళ్ల‌కుండా ఉండే ధోరణికి విసుగు చెంది, చాలా మంది నేత‌లు ప‌నిచేయలేదు.

kesineni 20012023 2

మొత్తానికి టిడిపి నేతలు అందరూ కలిసి, గెల‌వాల్సిన విజ‌య‌వాడ కార్పొరేష‌న్ చేజార్చుకున్నారు. అయితే అదే సందర్భంలో నాని, తానే విజయవాడ అధిష్టానం అని ప్రకటించటం కూడా అప్పట్లో వివాదస్పదం అయ్యింది. ఇక విజయవాడలో అనేక అరాచకాలు జరిగినా, అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే నాని స్పందించారు. ఒక పక్క కార్యకర్తలు ప్రాణాలు ఒడ్డి, అటు వైసీపీతో పోరాడుతుంటే, కేశినేని నాని మాత్రం, వైసీపీకి అవకాసం ఇచ్చే విధంగా ప్రకటనలు చేస్తూ ఉండటంతో, టిడిపికి ఇబ్బందిగా మారింది. ఏదైనా ఉంటే చంద్రబాబుతో తేల్చుకోవాలి కానీ, ఇలా రచ్చ చేసుకుని, నాని ఏమి సాధిస్తారు అంటూ, సోషల్ మీడియాలో టిడిపి శ్రేనులు నిలదీస్తున్నాయి. పార్టీ అన్నాక, అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. కేశినేని నాని అన్నారని, బుద్దా వెంకన్న రియాక్ట్ అవ్వటం, ఇలా పార్టీ నేతలు బహిరంగంగా విమర్శించుకుంటుంటే, పార్టీ అధికారంలోకి రావాలని పోరాడుతున్న కార్యకర్తలు నీరసం అయిపోతున్నారు. రెండు సార్లు ఎంపీగా చేసిన నాని, అందరినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలని, ముఖ్యంగా అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని, మన పోరాటాలు వైసీపీ పై ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కేశినేని నాని ఎలాంటి సంచలనాలకి తెర లేపుతారో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read