టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో 400 రోజులపాటు పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. దీనిపై వైసీపీ స్పందనలు చాలా విచిత్రంగా వున్నాయి. లోకేష్ పాదయాత్ర చేస్తే మాకేంటట అంటూనే రోజుకొక మంత్రి మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నారు. పాదయాత్రని పట్టించుకోనప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలతో విరుచుకుపడటం వెనుక భావమేంటని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క పాదయాత్రకి ఇప్పటివరకూ అనుమతి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. జీవో1ని హైకోర్టు సస్పెన్షన్లో పెట్టినా, దాని అమలు కోసం సుప్రీంకోర్టు మెట్లెక్కి చీవాట్లు తిని వచ్చారు. ఓ వైపు కోర్టుల ద్వారా పరోక్షంగా ఆపడానికి ప్రయత్నాలు చేస్తోంది జగన్ సర్కారు. ఇంకోవైపు పోలీసులకు అన్ని స్థాయిల్లో అనుమతుల కోసం దరఖాస్తులు చేసినా ఎవ్వరూ అనుమతి తిరస్కరించినట్టు కానీ..ఇస్తున్నట్టు కానీ ప్రకటించకుండా నాన్చుతున్నారు. టిడిపి కార్యాలయం నుంచి రిమైండర్ లేఖలు రాసినా స్పందన శూన్యం. పాదయాత్ర కాకపోతే పొర్లుదండాలు పెట్టుకోమంటూ మంత్రి రోజా సెటైర్లకి టిడిపి నుంచి గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ లోకేశ్ గురించి ఆలోచించాల్సినవసరం లేదంటూనే అక్కసు వెళ్లగక్కాడు. మొత్తానికి లోకేష్ పాదయాత్ర అనేసరికి వైసీపీలో వణుకు ప్రారంభమైందని వాళ్ల ప్రకటనలు, చర్యల వల్ల స్పష్టం అవుతోంది.
లోకేష్ పాదయాత్ర అడుగు కూడా పడక ముందే, వైసీపీ పడుతున్న పాట్లు చూడండి
Advertisements