సంక్రాంతి పండగ అంటేనే తెలుగు లోగిళ్లు వెలిగిపోతాయి. అచ్చమైన పల్లె పండగని కోట్లాది మంది జరుపుకున్నారు. సంస్కృతికి సంక్రాంతి నిదర్శనం. సంప్రదాయాలకు పెద్ద పండగ. వ్యవసాయమే జీవనాధారమైన ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండగ అంటే పంట ఇంటికొచ్చినంత ఆనందంగా జరుపుకుంటారు. పిల్లా పెద్దా అని తేడా లేదు. ధనికా పేదా తారతమ్యం లేకుండా బంధువులంతా ఒక చోట చేరి పండగ జరుపుకుంటారు. కరోనా వల్ల రెండేళ్లుగా కళ తప్పిన ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు కొత్త కాంతులు విరజిమ్మాయి. అందరిలాగే తన పల్లెలో భోగి, సంక్రాంతి పండగలను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి గ్రామస్తులతో సామూహిక భోజనాలు చేశారు. ఎడ్లబండిపై ఊరేగారు. గ్రామస్తులకు ముగ్గులు, గాలిపటాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తమ పెద్దలకు, నాగాలమ్మ తల్లికి పూజలు చేశారు. మొత్తానికి తెలుగువారి లోగిళ్లలో జరిగే అచ్చమైన పల్లె సంక్రాంతిని బంధుమిత్ర సపరివారంగా గ్రామస్తులతో కలిసి చంద్రబాబు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు సినిమా సెట్‌ని తలపించాయి. ఇంట్లోనే సంక్రాంతి పల్లె సెట్ వేశారు. ఆయన భార్య తప్ప, ఇతర కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా జరిగిన పండగ అచ్చం సినిమా షూటింగ్ ని తలపించింది. వేకువనే నారావారి పల్లెలో భోగి మంటలు వేసుకున్నది చంద్రబాబు అయితే, వైఎస్ జగన్ మిట్టమధ్యాహ్నం చెవిరెడ్డి వేయించిన సెట్ లో భోగి మంటలు వెలిగించారు. మొత్తానికి సంక్రాంతి సంప్రదాయాన్ని సమున్నతంగా చంద్రబాబు పాటిస్తే, జగన్ సంక్రాంతి షూటింగ్‌ని తలపించింది.
ఇద్దరు నాయకుల సంక్రాంతి పండుగ జరుపుకున్న తీరులో ఎంత తేడా...
Advertisements