తమ ఇంటి పని చేసేవారు ఒక సలహాదారుడు. తమ వంట పనిచేసేవాడు మరొక సలహాదారుడు. సాక్షి జీతగాళ్లకు ప్రజాధనం దోచిపెట్టడానికి సలహాదారుల పోస్టులు కట్టబెట్టిన వైసీపీ ప్రభుత్వం హైకోర్టు వ్యాఖ్యలతో భయం పట్టుకుంది. లెక్కలేనంత మంది సలహాదారుల్ని వేసుకుని జనం సొమ్ము దోపిడీకి దారులు వేసిన వైసీపీ సర్కారుకి ఎంత మంది ఉన్నారో తెలియకపోవడం షాక్ కి గురిచేస్తోంది. దేవాదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్, ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి నియామకాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వాదనల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. చివరికి ఉద్యోగులకు డీఏ ఇవ్వడం కోసం మరో సలహాదారున్ని నియమిస్తారా అని ప్రశ్నించారు. ఇలా వదిలేస్తే రేపు తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారులు ఉండగా శాఖలకు సలహాదారులు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకంపై రాజ్యాంగబద్దతను తేలుస్తామని, ఎంత మంది సలహాదారులున్నారో..వారి విధులు, జీతభత్యాలు తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో తాము ఎడాపెడా నియమించిన సలహాదారులు ఎంతమంది రాష్ట్రంలో ఉన్నారో వారి వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది. శాఖలవారీగా సలహాదారుల వివరాలు వెంటనే పంపాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సలహాదారుల పేర్లు, హోదా, ఎప్పట్నుంచి ఉన్నారనే వివరాలు పంపాలని, ఇవి హైకోర్టుకు సమర్పించాల్సి ఉందని కోరింది.
ప్రజాధనం దోపిడీకి సలహా`దారులు` వేసిన సర్కారుకే ఎంతమందో తెలియదా?
Advertisements