గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ లో విజ‌య‌సాయిరెడ్డిని కూర‌లో క‌రివేపాకులా వాడి పారేసార‌ని ఆయ‌న అభిమానులు వాపోతున్నారు. కొద్దిరోజులుగా తాడేప‌ల్లి ప్యాలెస్‌కీ, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు సాయిరెడ్డి. ఒక్కో ప‌ద‌వి నుంచి త‌ప్పించేయ‌డంతో తీవ్ర నిస్పృహ‌లో ఉన్న విజ‌య‌సాయికి మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డిన‌ట్టు వ‌ర‌స విషాదాలు, కేసులు వెంటాడుతున్నాయి. అల్లుడు అన్న అర‌బిందో శ‌ర‌త్ చంద్రారెడ్డి డిల్లీ లిక్క‌ర్ కేసులో బుక్క‌య్యాడు. ఎలా విడిపించుకోవాలో తెలియ‌క ఢిల్లీ పెద్ద‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. అయితే వైసీపీ అధిష్టానం విజ‌య‌సాయిరెడ్డికి ఈ కేసు విష‌యంలో ఎటువంటి సాయం అందించ‌డంలేద‌ట‌. మ‌రోవైపు సాయిరెడ్డికి కుమార్తె వ‌ర‌స‌య్యే అలేఖ్య రెడ్డి భ‌ర్త తార‌క‌ర‌త్న మ‌ర‌ణం మ‌రింత కుంగ‌దీసింది. మూడు త‌రాలుగా వైఎస్ కుటుంబాన్నే న‌మ్ముకుని ఉన్న న‌మ్మ‌క‌మైన ఆడిట‌ర్‌ మాన‌సికంగా అలిసిపోయి వున్న ద‌శ‌లో జ‌గ‌న్ రెడ్డి నుంచి క‌నీస మ‌ద్ద‌తు క‌రువైంది. కొద్దిరోజులుగా ట్వీట్లు కూడా త‌గ్గించేశారు. వేసేవి కూడా చాలా మ‌ర్యాద భాష‌లో ఉంటున్నాయి. విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు ప‌ట్ల ఇటీవ‌ల క‌న‌బ‌రుస్తున్న గౌర‌వం కూడా తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఆగ్ర‌హావేశాల‌కు మ‌రో కార‌ణం అని తెలుస్తోంది. అయితే ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు, ప్ర‌ముఖుల‌తో లాబీయింగ్‌లో ఆరితేరిన సాయిరెడ్డిని వైసీపీ దూరం పెట్టింది. గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌కి కూడా పెద్ద‌గా పాత్ర‌లేదు. కానీ సాయిరెడ్డి సేవ‌లు వాడుకోవాల‌నుకుని చెవిరెడ్డిని రాయ‌బారం పంపారు. స‌మ్మిట్‌కి ముందు విశాఖ‌లో లెక్క‌ల మాస్టారుని దింపినా..ఎక్క‌డా ఆయ‌న మార్కు క‌న‌ప‌డ‌లేదు. పిలిచి మ‌రీ సాయిరెడ్డిని అవ‌మానించార‌ని ఆయ‌న మ‌నుషులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read