వైసీపీ అధికారంలోకి రావాలని తాను రాజశ్యామల యాగం చేశానని, విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామి గతంలోనే చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్వామి అనధికారిక దేవాదాయశాఖా మంత్రిగా అధికారం చెలాయిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల ఏమైందో ఏమో కానీ విశాఖ పీఠం తాము న్యూట్రల్ అని చెప్పుకోవటానికి ప్రయత్నిస్తోంది. వైసీపీ దారుణ పరాజయం తప్పదని డిసైడ్ అయిన తరువాతే స్వాములు ఇలా ప్లేటు ఫిరాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని కురుక్షేత్రకు సమీపంలోని ఆశ్రమం ఆధ్వర్యంలో లక్ష చండీ మహాయజ్ఞం నిర్వహించారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి స్పందించారు. విశాఖ శారదా పీఠం ఒక రాజకీయపార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. విశాఖ శారదాపీఠం ఎవరికీ వత్తాసు పలకదని తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీల కోసం పూజలు చేయడం లేదని స్పష్టం చేశారు. మొదటి నుంచీ పీఠంపై కొందరు ఉద్దేశపూర్వకమైన ముద్ర వేస్తున్నారని.. ఎవరైనా శారదా పీఠాన్ని ఆశ్రయిస్తే యాగాలు చేస్తాం తప్పితే ఏ పార్టీకో, వ్యక్తికో అధికారం రావాలని ఎప్పుడూ చేయలేదు అని చెప్పుకొచ్చారు. మొదటిసారిగా తమ పీఠంపై వచ్చిన ఆరోపణలపై స్వామి వివరణ ఇవ్వడంలోనే ఏదో మతలబు ఉందంటున్నారు. లక్ష చండీయాగం లైవ్ చేస్తే, ఒక్కరు చూడటం కూడా సోషల్మీడియాలో ట్రోలింగ్కి గురైంది. అధికారం దూరం అవుతుందని తెలిసే, శారదా పీఠం స్వాములు జగన్ రెడ్డికి దూరం అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.
జగన్ పని అయిపోయిందని విశాఖ స్వామి కనిపెట్టేశాడా ? ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసారు ?
Advertisements