ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తిని వైసీపీ స‌ర్కారు  ఒక ఇంచు కూడా క‌ద‌ల్చ‌లేదా? అమ‌రావ‌తి అంతానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా  ఫ‌లించ‌క‌పోవ‌డంతో చివ‌రికి సుప్రీంకోర్టులో స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్న వైసీపీ స‌ర్కారుకి చుక్కెదురు కాక త‌ప్ప‌ద‌ని న్యాయ‌నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌తో అమ‌రావ‌తిని నాశ‌నం చేయాల‌నుకుంటే, రాజ్యాంగ‌మే ప్ర‌జారాజ‌ధానికి ర‌క్ష క‌ల్పిస్తోంద‌ని అంటున్నారు. కేఎం జోసెఫ్ వ్యాఖ్యలతో ట్విస్ట్.అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ ఫాస్ట్ ట్రాక్ లో నిర్వహించాలని ఏపీ స‌ర్కారు లాయ‌ర్లు చేసిన‌ విజ్ఞప్తిని న్యాయమూర్తి కేఎం జోసెఫ్ తోసిపుచ్చారు. ఈ వ్యవహారం రాజ్యాంగ పరమైన అంశాలతో ముడిపడి ఉందని చెప్ప‌డంతో కేసు విష‌యంలో స‌ర్కారుకి స్ప‌ష్ట‌త వ‌స్తోంద‌ని అర్థం అవుతోంది. అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టేందుకు రాజ్యాంగపరమైన ఆంశాల్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది. దీన్ని సాధారణ బెంచ్ కంటే రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్న అమ‌రావ‌తి రైతుల‌కు న్యాయ‌మూర్తి కేఎం జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా క‌లిసి వ‌స్తున్నాయి. వీలైనంత తొంద‌ర‌గా సుప్రీంకోర్టు విచార‌ణ ముగిస్తే, విశాఖ‌కి రాజ‌ధాని షిఫ్ట్ చేసేయొచ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు సీఎం జ‌గ‌న్ రెడ్డి. కోర్టులో ఉన్న అంశం అని కూడా చూడ‌కుండా ప‌దేప‌దే తానిక్క‌డ‌కే వ‌చ్చేస్తున్నాన‌ని, ఇదే రాజ‌ధాని అని ప్ర‌క‌టిస్తున్నారు. అయితే విచార‌ణ త్వ‌రిత‌గ‌తిన  పూర్తి చేయాల‌నే డిమాండ్‌ని ధ‌ర్మాస‌నం తోసిపుచ్చ‌డంతోపాటు ఓ రాష్ట్ర భవిష్యత్తు, రాజ్యాంగ అంశాలతో ముడిపడిన ఈ పిటిషన్ల విచార‌ణ‌ని రాజ్యాంగ ధ‌ర్మాస‌నంకి అప్ప‌గించేలా జ‌డ్జి వ్యాఖ్య‌లున్నాయి.రాజ్యాంగ ధ‌ర్మాస‌నం తీర్పే అంతిమ‌తీర్పు కానుంద‌ని, దీనిపై ఏ అప్పీల్ కి వెళ్లే అవ‌కాశం లేక‌పోవ‌డంతో వైసీపీ ఈ అవ‌కాశాన్ని సుప్రీంకోర్టు-కేంద్రం మ‌ధ్య వివాదానికి వాడుకుని ల‌బ్ధి పొందే ఎత్తుగ‌డ‌ల‌కు తెర‌తీస్తోంద‌ని వార్త‌లు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read