వైఎస్ జగన్ రెడ్డి సీఎం అయిన నుంచీ అమరావతి అంతమే పంతంగా పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ప్లేటు ఫిరాయించాడు. మూడు రాజధానులంటూ ఒకసారి, విశాఖ రాజధాని అని మరోసారి డ్రామాలాడుతూ అమరావతిని ఆపేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. అయితే అమరావతిని ఎంత తొక్కుదామని జగన్ ప్రయత్నిస్తుంటే, అంతగా పైకి లేస్తోందని ఒక్కో సంఘటనా స్పష్టం చేస్తోంది. కెరటం నాకు ఆదర్శం ..ఎందుకంటే పడినా లేస్తున్నందుకు అన్నాడు స్వామి వివేకానంద. అమరావతి కూడా కెరటాన్ని ఆదర్శంగా తీసుకుందేమో! పడిన ప్రతీసారీ అంతకంటే ఉవ్వెత్తున లేస్తోంది. నిర్మాణంలో ఉన్న ప్రపంచస్థాయి నగరాలతో ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ ఓ జాబితాలో అమరావతికి చోటు దక్కింది. భవిష్యత్ నగరాల జాబితాలో ఏపీ రాజధాని అమరావతికి ప్లేస్ దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అమరావతి పేరు మారుమోగింది. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిందని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ వెల్లడించింది. అమరావతి భవిష్యత్తులో అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవటం ఖాయమని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
జగన్ ఎంత తొక్కాలని చూస్తే, అంత లెగుస్తున్న అమరావతి
Advertisements