మూడోసారి విచారణ ముగించుకుని వచ్చిన తరువాత సీఎం వైఎస్ జగన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు ఫ్రస్టేషన్‌లో ఉన్నాయని అనిపిస్తోంది. వివేకా హ-త్యకేసు నుంచి ఎటూ తప్పించుకోలేని స్థితిలో ఏకంగా వివేకా కుటుంబసభ్యులపైనే ఆరోపణలకు బరితెగించేశారు. వివేకానందరెడ్డి అక్రమసంబంధాలు, రెండో భార్య వల్ల హ-త్య జరిగిందని అనుమానం వ్యక్తం చేయడం ద్వారా తాను తప్పించుకునే మార్గం చూసుకుంటున్నారు. మరోవైపు వివేకా కుమార్తె సునీత చెప్పినట్టు సీబీఐ వింటోందని, సీబీఐ ఆదేశాలతోనే సునీత ఈ కేసులో ముందుకు వెళుతోందని అవినాష్ చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేసే సీబీఐ, ఈడీలు అనేది ఎంపీ అవినాష్ రెడ్డికి తెలియకపోవడం విచిత్రం. అలాగే కేంద్రంతో తన అన్న జగన్ రెడ్డి సంబంధాలే ఇప్పటివరకూ కాపాడుకుంటూ వస్తున్నాయని అవినాష్ రెడ్డి మరిచిపోయి ఆరోపణలు చేస్తున్నారు. సునీత చెప్పినట్టు సీబీఐ వింటే ఈ పాటికే ఆధారాలు అవినాశ్ వైపు చూపుతుండడంతో ఎప్పుడో అరెస్టయ్యేవాడని అంటున్నారు. ఓ వైపు సీబీఐ సునీత చెప్పినట్టు వింటోందని అంటూనే, సీబీఐ తీసుకున్నది గూగుల్ టేకవుట్ కాదు.. టీడీపీ టేకవుట్ అని విమర్శించి అడ్డంగా బుక్కపోయారు అవినాష్. విచారణ సమాచారాన్ని సీబీఐ వాళ్లే మా సోదరి సునీతకి ఇస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. తాను లంచ్ మోషన్ వేసిన వెంటనే సునీతకి సీబీఐ సమాచారం ఇస్తోందని వాపోయారు.
సునీత మాట సీబీఐ వింటే అవినాష్ రెడ్డి ఎప్పుడో అరెస్ట్ అయ్యేవాడే !
Advertisements