తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించినప్పుడే, వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని తేలిపోయింది. కోర్టులో కూడా సీబీఐ అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పేసింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం మార్చి 14న వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఇప్పుడు హైకోర్టు కూడా మార్చి14న సీబీఐ ముందు హాజరవ్వాలని సూచించడం...అదే రోజు అరెస్టు తప్పదని, ఇది దేవుని స్క్రిప్ట్ అంటున్నారు నెటిజన్లు. ఏ బాబాయ్ హత్యని చూపించి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందారో అదే హత్యకేసు తన మెడకి చుట్టుకోవడంతో డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరతీశారు. మార్చి 14న అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే, ఆ టాపిక్ నుంచి జనాల్ని డైవర్ట్ చేయడానికి చాలా పెద్ద ప్లాన్లు వైసీపీ వేసిందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఓ వైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుతో సీఐడీ అరెస్టులు, మరోవైపు రాజధాని భూముల కేసులో నారాయణ ఇంటి చుట్టూ తిరుగుతున్న సీఐడీ, తాజాగా ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి అధికారులని అదుపులోకి తీసుకుంటున్న సీఐడీ కేసులని చూస్తే...అవినాష్ అరెస్టు తప్పదని తేలిపోతోంది. ఆ అరెస్టుని డైవర్షన్ చేయడానికే సీఐడీని వాడుకుని ప్రతిపక్షం, ప్రధాన మీడియా సంస్థలపై కేసులని తెలుస్తోంది.
డైవర్షన్ ప్లాన్ అదిరింది... వివేకా కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పక పోవటంతో, డైవర్షన్ ప్లాన్...
Advertisements