విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రెడ్డిని పొడిచిన కోడికత్తి ఎక్కడుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పటివరకూ విచారణ జరగని ఈ కేసు ఇటీవలే కదలిక వచ్చింది. అయితే బాధితులు, సాక్షులు రాకుండా కేసు విచారణ ఎలా అని న్యాయమూర్తి ప్రశ్నించడంతో సాక్షి వచ్చారు కానీ, బాధితుడైన జగన్ రెడ్డి మాత్రం కేసు విచారణకి రావడంలేదు. ఈకోడికత్తి కేసులో అసలు బాధితుడు అప్పటి ప్రతిపక్ష నేత.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇప్పటివరకు కోర్టుకు హాజరుకాలేదు. నిందితుడు ఇప్పటి వరకు కోర్టుకు హాజరుకాకపోవటంపై ఎన్ ఐఏ కోర్టు అసహనం వ్యక్తంచేసింది. బాధితుడిగా భావిస్తున్న జగన్ కోర్టుకు రావాల్సిందేనని గతంలో స్పష్టంచేసింది. అయినా జగన్ కోర్టుకు హాజరుకాకపోవడం ఏంటని అసహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్న కోడికత్తిని కోర్టులో ప్రవేశపెట్టలేదని తెలుస్తోంది. మరోవైపు అవినాష్ రెడ్డి కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు కోడికత్తి కేసులో మరో ట్విస్ట్ కి తెరలేపాయి. జగన్ రెడ్డిపై దాడి జరిగిన రోజు ఎయిర్ పోర్టులో సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదట. అంటే ఇదంతా చాలా ప్లాన్డ్గా రికార్డు కాకూడదని చేసినట్టే ఉంది. 2018లో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై జనిపల్లి శ్రీనివాస రావు కోడికత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. ఈ కేసు విచారణని ఎన్ఐఏ తీసుకుంది. అప్పటి నుంచి జైలులోనే కోడికత్తి శ్రీను ఉంటున్నాడు. సీఎం జగన్ రెడ్డిని కలిసేందుకు కోడికత్తి శ్రీను తల్లిదండ్రులు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. శ్రీను లాయర్ విజ్ఞప్తి మేరకు విజయవాడ ఎన్ఐఎ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రధానమైన కోడికత్తిని తీసుకురావాలని కోర్టు ఆదేశించింది. కోడికత్తి కేసుకు సంబంధించి సాక్షిగా సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేశ్ కుమార్ ను కోర్టు విచారించింది.
జగన్ ని పొడిచిన కోడికత్తిని తీసుకురండి.. కోర్టు సంచలన ఆదేశాలు ..
Advertisements