తోటరాముడు అనే ఆకు రౌడీ కవి కూడా. ఆయన రాసిన కవితే. చెల్లికి జరగాలి మళ్లీ పెళ్లి కవిత. ఇది కామెడీ కోసమే అయినా ఏపీ సీఎం నిజం చేసి చూపించారు. ఇప్పటివరకూ ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసిన ఒకే ఒక్క కర్మాగారంగా కడప ఉక్కు నిలిచింది. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 2007 జూన్ 10న నాటి కడప ఉక్కు పరిశ్రమ కోసం భూమిపూజ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి కంపెనీ బ్రహ్మణి ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఉక్కు ఫ్యాక్టరీ ఘనమైన ప్రకటనలు కడప జిల్లావాసులని ఊరించాయి. సేకరించిన భూముల్లో ఒక్క ఇటుకా పెట్టలేదు. 2018 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గండికోట రిజర్వాయర్ ఎగువన ఉన్న కంబాలదిన్నెలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని శిలాఫలకం వేశారు. ఐదు నెలల్లో అధికారం కోల్పోయారు. దీంతో కడప ఉక్కు ఫ్యాక్టరీ మరోసారి శిలాఫలకానికే పరిమితమైంది. ముచ్చటగా మూడోసారి 2019 డిసెంబర్ 23న జగన్ కూడా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఇది ఏమైందో తెలియదు కానీ, జగన్ మోహన్ రెడ్డి మళ్లీ కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు సున్నపురాళ్లపల్లె వద్ద మళ్లీ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం అయిన ఏడాదిలో చేసిన శంకుస్థాపన తరువాత టాటా వారు వస్తున్నారని ఒకసారి, విదేశీ కంపెనీ పెట్టుబడులు పెడుతోందని మరోసారి ఘనంగా ప్రకటించారు. ఆ ప్రతిపాదనలు ఏమయ్యాయో కానీ చెల్లికి మళ్లీ పెళ్లి టైపులో కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఈ సారి జేఎస్ డబ్ల్యూ వారు పేరు వినిపిస్తున్నారు. ఇది మరో శంకుస్థాపనకి వెళుతుందా? కార్యకలాపాలు ఆరంభిస్తుందా అనేది చూడాలి.
కడప ఉక్కు చెల్లికి మళ్లీ పెళ్లి చేయనున్న జగన్
Advertisements