ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఇటీవ‌ల అన్నివైపుల నుంచి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. సీనియ‌ర్ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుని ఎలాగైనా డిస్మిస్ చేయాల‌నుకున్న వైసీపీ స‌ర్కారుకి కేంద్రం నిర్ణ‌యంతో స‌గం మోదం-స‌గం ఖేదం మిగిలింది. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ తిర‌స్క‌రించింది. అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాసింది. క్ర‌మ‌శిక్ష‌ణ  చర్యల్లో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్లు రద్దు చేసేందుకు వెసులుబాటు క‌ల్పించింది. టిడిపి హ‌యాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కోడిక‌త్తి కేసులోనూ, బాబాయ్ హ‌త్య కేసులోనూ త‌న గుట్టుమ‌ట్ల‌న్నీ ప్ర‌భుత్వానికి అందించింది ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు అని వైసీపీ అధినేత‌కి అనుమానాలున్నాయి.వైసీపీ స‌ర్కారు వ‌చ్చిన నుంచి ఏబీవీని ఏదో ర‌కంగా వేధిస్తూ వ‌చ్చారు. టిడిపి హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న‌ ఏబీ వెంకటేశ్వరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించి, విధుల నుంచి తొలగించింది. దీనిపై ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు న్యాయపోరాటం చేయ‌గా సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గతేడాది సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆ పోస్టింగ్ ఇచ్చి, ఓ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేశారని మ‌ళ్లీ సస్పెండ్ చేశారు. వైసీపీ పాల‌న‌లో అస‌లు పోస్టింగ్ ఇవ్వ‌కుండా ఏబీవీని రిటైర్ అయ్యేలా, లేదంటే ఉద్యోగం నుంచి తొల‌గించాల‌నుకున్న వైసీపీ అధినేత కోరిక నెర‌వేరలేదు. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగించడం, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడం కుదరదని స్పష్టం చేసింది. శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని, రిటైర్ అయ్యే వరకు లభించే ఇంక్రిమెంట్లను రద్దు చేయవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏపీ సీఎస్ కు లేఖ రాసింది. యూపీఎస్సీ సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read