వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏ ప్రభుత్వ ఉద్యోగికి ప్రతీ నెలా ఒకటో తేదీన జీతం పడిన దాఖలాలు లేవు. కొందరికి మూడు వారాలు తరువాత కూడా జీతాలు పడుతున్నాయి. కొందరికైతే నెలల తరబడి జీతాలు లేవని ఆందోళనలు సాగుతున్నాయి. జీతాలు సకాలంలో చెల్లించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని యూటీఎఫ్ నేతలు హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్ని కలిసి తమ జీతాలు సకాలంలో ఇప్పించాలని కోరడం దేశంలోనే కలకలం రేపింది. ఉద్యోగసంఘంపై ఏపీ సర్కారు సీరియస్ అయి నోటీసులు ఇచ్చింది. గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పించిన కార్యదర్శి ఆర్ పి సిసోదియాని జీఏడీకి అటాచ్ చేసింది. కానీ జీతాలు మాత్రం ఇవ్వడంలేదు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో చెల్లించని సర్కారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రం ఠంచనుగా ఒకటో తేదీనే జీతాలు, వేతనాలు, భత్యాలు చెల్లిస్తూ వస్తోంది. జీతభత్యాలు అవసరమే లేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడగకుండానే ఒకటో తేదీనే జీతభత్యాలన్నీ వేసేస్తున్న ప్రభుత్వం ...ఈఎమ్ఐలు, లోన్లు కట్టాల్సిన లక్షలాది ఉద్యోగులకు మాత్రం ఒకటో తేదీ వెళ్లి మూడు వారాలైనా జీతాలు చెల్లించకపోవడంతో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
1వ తేదీనే ఎమ్మెల్యేలకు జీతాలు..ఉద్యోగులకు మాత్రం ఏ తేదీయే కూడా చెప్పలేరు
Advertisements