ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తమకు జీతాలు ఇవ్వటం లేదు అంటూ, కొన్ని ఉద్యోగ సంఘాలు, గవర్నర్ దగ్గరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. తమకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం లేదని, పెన్షన్లు సమయనికి ఇవ్వటం లేదని, ఇవి సమయానికి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి అంటూ, గవర్నర్ వద్దకు వెళ్లి, తరువాత మీడియాతో మాట్లాడారు కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఎన్నో మార్గాలు ఉండగా, గవర్నర్ దగ్గరకు ఎలా వెళ్తారు, మీడియాతో ఎలా మాట్లాడతారు అంటూ, కొన్ని నిబంధనలు సాకుగా చూపి, షోకాజ్ నోటీస్ జారీ చేసింది. మీ ఉద్యోగ సంఘాల గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు అంటూ, ప్రశ్నించింది. దీని పైన ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే విషయం అంటూ, ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీస్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు. దీని పైన విచారణ జరిపిన హైకోర్టు, ఉద్యోగ సంఘాల రద్దు పై స్టే విధించింది. దీని పై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read