మూడు రాజధానులకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసిందంటూ టీవీ9లో వేసిన ఫేక్‌ బ్రేకింగ్స్ పై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి హైకోర్టు న్యాయ‌వాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఎటువంటి తీర్పులు ఇవ్వ‌క‌పోయినా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందంటూ బ్రేకింగ్స్ వేశారని న్యాయవాది లేఖ‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ తో పాటు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకూ ఫిర్యాదు చేశారు. ప్రజలకు తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా బ్రేకింగ్స్ వేశారని ఫిర్యాదు. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఎటువంటి తీర్పులు ఇవ్వ‌క‌పోయినా, మూడు రాజ‌ధానుల‌కు లైన్ క్లియ‌ర్ చేస్తూ తీర్పులు ఇచ్చిన‌ట్టు కోర్టుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా చేసిన‌ ప్ర‌సారాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. 2023 ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 12.40 గంటలకు సుప్రీం కోర్టు పేరుతో  ప్రజల‌ని త‌ప్పుదోవ ప‌ట్టించాల‌నే ఉద్దేశంతో టీవీ9 న్యూస్ ఛానెల్ అబద్ధాలను వార్తగా ప్రసారం చేసిందని లేఖ‌లో పేర్కొన్నారు. ఇలాంటి అసత్యాలను ప్రసారం చేయడంలో నేరపూరిత కుట్ర కనిపిస్తోందని అనుమానించారు. సుప్రీంకోర్టు పేరుతో త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేసిన టీవీ9 ఎడిటర్,  మేనేజ్‌మెంట్ పై సుమోటో చర్యలు తీసుకోవాలని లేఖ‌లో కోరారు. వేసిన బ్రేకింగ్స్ కి సంబంధించిన ఆధారాల‌ను లేఖ‌లో జ‌త చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read