ఏ ఆర్డినెన్స్ పంపినా పెద్ద మ‌న‌సుతో నిమిషం ఆల‌స్యం చేయ‌కుండా సంత‌కం చేసేవారు. ప్ర‌భుత్వాన్ని కోర్టులు అభిశంసించినా ప‌ట్టించుకోని విశాల హృద‌యం గ‌వ‌ర్న‌ర్ ది. చివ‌రికి ఉద్యోగ‌సంఘాల‌కు అపాయింట్మెంట్ ఇప్పించార‌నే కార‌ణంతో త‌న సెక్ర‌ట‌రీ సిసోదియాని సీఎం ఆక‌స్మికంగా బ‌దిలీ చేసినా, ఎందుకు చేశారు బ‌దిలీ అని అడ‌గనంత సాత్వికుడైన గ‌వ‌ర్న‌ర్‌ని ఎందుకింత హ‌ఠాత్తుగా బ‌దిలీ చేశార‌ని ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ న‌డుస్తోంది. వైసీపీ ప్ర‌భుత్వం కోసం బీజేపీ పంపిన దేవుడిలాంటి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ని ప్ర‌భుత్వం ఉన్నంత‌వ‌ర‌కూ ఉంటార‌ని అనుకున్నారు. స‌డెన్ గా ఇత‌ర రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల బ‌దిలీలు, కొత్త నియామ‌కాల‌లో గవర్నర్ హ‌రిచంద‌న్‌ని చ‌త్తీస్ గ‌ఢ్‌కి పంప‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు ఉన్న ఏ రాష్ట్రంలోనూ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. అటువంటిది ఏపీలో వైసీపీ స‌ర్కారుకి గ‌వ‌ర్న‌ర్ అందించిన స‌హ‌కారం చూస్తుంటే, వైసీపీ కోసం బీజేపీ ఏమైనా చేస్తుంద‌ని ప్ర‌జ‌లు న‌మ్మేవారు. అయితే స‌డెన్‌గా ఏపీకి కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి అబ్దుల్ నజీర్‌ను నియమించారు. దీంతో వైసీపీతో బీజేపీ హ‌నీమూన్ పిరియ‌డ్ ముగిసింద‌ని, స‌ర్వేల‌లో వైసీపీ ప‌ని అయిపోయింద‌ని తెలిసి బీజేపీ పెద్ద‌లు దూరం అవుతున్నార‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. ఇందులో భాగంగానే వైసీపీ స‌ర్కారుతో అత్యంత స్నేహంగా ఉండే బిశ్వ‌భూష‌ణ్‌ని చ‌త్తీస్ గ‌ఢ్ పంపార‌ని టాక్ వినిపిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read