ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్టు...వైసీపీ నేత‌ల పోరు టిడిపి జంపింగ్ ఎమ్మెల్యేల మీద ప‌డుతోంది. వైసీపీపై ఆరోప‌ణ‌లు చేస్తున్న నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పౌరుషం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. దీనికి స్పందిస్తూ టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, ఆ తర్వాత నా రాజీనామా అడగాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్‌కి ఎమ్మెల్యే కోటం రెడ్డి స‌వాల్ విసిరారు. తనకు అధికారం అనుభవించి బయటకి వెళ్లడం ఇష్టం లేదన్నారాయన అందుకే ముందుగానే అధికార పక్షానికి దూరంగా నిలబడ్డాని చెప్పుకొచ్చారు. తనకు అండగా నిలిస్తే కష్టాలు తెచ్చుకున్నట్లేనని, అయినా తన వెంట అనేక మంది నిలుస్తున్నారని కోటం రెడ్డి అన్నారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు అండగా నిలిచారన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీకి దూరం కావ‌డంతోనే వైసీపీ మిత్రులంతా శ‌త్రువులా మాదిరి ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల దాడికి దిగుతున్నారు. కోటంరెడ్డి కూడా ఎక్క‌డా త‌గ్గ‌డంలేదు. రాజీనామా డిమాండ్‌ని త‌న మాట చాతుర్యంతో తిప్పికొట్టారు. టిడిపి టికెట్ పై గెలిచి వైసీపీలో చేరిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, మ‌ద్దాలి గిరి, క‌ర‌ణం బ‌లరాం,వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్ వంటి వారు ఎట్టి ప‌రిస్థితుల్లో రాజీనామా చేయ‌రు. వారు రిజైన్ చేస్తే తాను వెంట‌నే చేస్తానంటూ మెలిక పెట్ట‌డం ద్వారా రాజీనామా డిమాండ్ ని వైసీపీ నేత‌లు చేయ‌కుండా కోటంరెడ్డి అడ్డుక‌ట్ట వేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read