ఏపీ ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ అనతికాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. ఆయనేదో ఘనత సాధించి ఇంత పేరు సంపాదించలేదు. అవగాహనలేనితనంతోపాటు అసందర్భపు ప్రేలాపనలతో వైసీపీ సర్కారు పరువే కాదు, ఏపీ పరువు కూడా తీసేస్తున్నాడు. ఎన్నిసార్లు బకరా అయినా, అదే మంత్రిని మీడియా ముందుకు పంపడం ఏదో ప్లాన్డ్గా చేస్తున్నట్టే అనిపిస్తోంది. ఏపీలో ఏదో ఒక సీరియస్ టాపిక్ పై చర్చలు జరుగుతుంటాయి. అప్పుడే ఆ అంశంతో సంబంధంలేకుండా పిచ్చివాగుడు వాగి పోతాడు మంత్రి అమర్ నాథ్. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకి దారి తీసింది. అప్పుడు అమర్ నాథ్ అనే ఈ కామెడీ పీస్ ని మీడియా ముందుకు వదిలారు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తనకి తెలియదని, అంటూనే పవన్ కళ్యాన్ వచ్చి తనని బతిమాలుకుని ఫోటో దిగాడంటూ ట్రోలర్లకి అతి పెద్ద ఆయుధం అందించి పోయాడు. దావోస్ ఎందుకు వెళ్లలేదు అని మీడియా అడిగితే అక్కడ మైనస్ 5 డిగ్రీల చలి వుంటుందని స్నానం చేయడానికి అవ్వదని చెప్పుకొచ్చి నవ్వులపాలై ఏపీని నవ్వుల పాలు చేశారు. మద్యనిషేధం అనే హామీ వైసీపీ మేనిఫెస్టోలో లేదని తేల్చేసిన గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు చూసి వైసీపీ నేతలే నోరెళ్లబెట్టారు. తెలంగాణలో ఈ రేసింగ్‌ల వద్ద మీడియా అడిగిన ప్రశ్నలకు కోడి గుడ్డు పెట్టాలని, ఆ గుడ్డు పొదిగించితే పెట్ట అవుతుందంటూ మరోసారి తన స్టాండప్ కామెడీ స్కిల్స్ ప్రదర్శించారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి లేమిపై ప్రజలు మాట్లాడుకోకుండా అమర్ నాథ్ కామెడీ గురించి ప్రజలు మాట్లాడుకునేలా వైసీపీ డైవర్షన్ ప్లాన్ ఇది అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
మంత్రి గుడివాడ అమర్ నాథ్ కామెడీతో ఏపీ పరువు పాయె
Advertisements