ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పనులు రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఏకంగా ఐఏఎస్ లు కూడా తప్పించుకుని తిరగాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న డబ్బులు ఏమైపోతున్నాయో అర్ధం కావటం లేదు కానీ, అవి మాత్రం మన మెడకు చుట్టుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు, ఐఏఎస్ అధికారులు బలి అయ్యారు. నిన్న సీఆర్డీఏ కార్యాలయం వద్ద పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టటం లేదు అంటూ, ఆ డబ్బులు వసూలు చేయటానికి కార్యాలయానికి వచ్చారు బ్యాంకర్లు. మూడేళ్ళ క్రితం అప్పు తీసుకున్నారని, దానికి వడ్డీ కట్టటం లేదని, మూడు నెలలకోసారి రూ.52 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉండగా, జనవరిలో వడ్డీ కట్టలేదని, ఎన్ని సార్లు లేఖలు రాసినా, ఫోన్ లు చేసినా స్పందన లేకపోవటంతో, బ్యాంకర్లు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయానికి వచ్చేసారు. మూడు బ్యాంకులకు సంబంధించిన అధికారులు వచ్చారు. అయితే సీఆర్డీఏ కమీషనర్ తాను వస్తున్నా అని చెప్పి రాకుండా, వేరే అధికారిని పంపించారు. అయితే తాము కమీషనర్ వచ్చే దాకా ఉంటామని చెప్పి, మూడు గంటలు ఎదురు చూసినా రాకపోవటంతో, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ, CRDAను డిఫాల్టర్‍గా ప్రకటిస్తామని హెచ్చరించి వెళ్లారు. ఇది మన రాష్ట్ర దౌర్భాగ్యం.
అప్పుకు వడ్డీ కట్టాలని కార్యాలయానికి వచ్చిన బ్యాంకర్లు.. తప్పించుకుని తిరుగుతున్న ఐఏఎస్ ఆఫీసర్లు...
Advertisements