తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పై మ‌రో కేసు న‌మోదు చేశారు పోలీసులు. పాద‌యాత్ర రెండో వారంలోకి ప్ర‌వేశించేస‌రికి ఐదు కేసులు బ‌నాయించార‌ని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. పాద‌యాత్ర జ‌ర‌గ‌కూడ‌ద‌నేది పోలీసులు ఇంటెన్ష‌న్ అని ఈ కేసుల ద్వారా తేటతెల్లం అవుతోంద‌ని టిడిపి చెబుతోంది. బుధ‌వారం పాద‌యాత్ర‌లో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం, పాదయాత్ర అనుమతులను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.  ఐపీసీ సెక్షన్ 188, 341, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశామంటోన్న పోలీసులు పాద‌యాత్ర‌ని వెంటాడుతున్నార‌ని, పోలీసులు గొలుసు దొంగల్లా లోకేశ్ పాదయాత్రలో మైకులు లాక్కెళ్తున్నారు మాజీ మంత్రి అమర్‍నాథ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పాదయాత్రకు ఆటంకాలు కలిగిస్తూ పోలీసులే విధ్వంసరచన చేస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. యువగళం పాదయాత్రకు 20 నుంచి 30 మంది పోలీసులు భద్రత కల్పిస్తుంటే.. పాదయాత్రను అడ్డుకోవడానికి మాత్రం 500 నుంచి 1000 మంది పోలీసులు వస్తున్నార‌ని టీడీపీ నేత పులివర్తి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read