అజయ్ అమృత్. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. గౌతమి కె పేరు మాత్రం సోషల్‌మీడియాలో బాగా ఫేమస్. వైసీపీ కోసం సోషల్‌మీడియాలో పనిచేసిన అజయ్ అమృత్ అలియాస్ గౌతమి కె పై కోర్టులను తూలనాడుతూ పెట్టిన సీబీఐ కేసు కూడా ఉంది. కోర్టుల్ని దూషిస్తూ పోస్టులు పెట్టమన్నవాళ్లు చేతులు ఎత్తేస్తే, అజయ్ అమృత్ ఆక్రోశంతో టిడిపి పంచన చేరాడు. తనకు వైసీపీ చేసిన అన్యాయం, ఏపీలో ప్రజలకు జరుగుతున్న నష్టంపై సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టనారంభించాడు. అంతే సడెన్‌గా అజయ్ అమృత్ దగ్గర గంజాయి దొరికేసింది. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం తిరుగుతూ, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కక్షతో గంజాయి కేసు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. తనను అరెస్ట్ చేస్తారని కొద్దిరోజులుగా ఆందోళనగా ఉన్న అజయ్ అమృత్ తన ఆవేదన సోషల్‌మీడియాలో వెళ్లగక్కాడు. అజయ్ ని పట్టుకునేందుకు ఆయన భార్య గర్భిణిని కూడా పోలీసులు టార్చర్ చేశారని ఆరోపించాడు. చివరకు అజయ్ అమృత్ ని అరెస్టు చేసి గంజాయి కేసు నమోదు చేశారు నరసరావుపేట పోలీసులు. అజయ్‌ని కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. వైసీపీ కోసం పనిచేసినంతకాలమూ అజయ్ గంజాయి వ్యాపారి కాదు. వైసీపీ నుంచి బయటకొస్తే అదే అజయ్ గంజాయి వ్యాపారి అయిపోతాడు. మహాసేన రాజేష్ విషయంలో వ్యవహరించినట్టే దళితుడైన అజయ్ పట్లా వైసీపీ కక్షతో వ్యవహరించిందని సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది.
వైసీపీని వీడే వారి దగ్గరే గంజాయి దొరుకుద్దా ?
Advertisements