నారా లోకేష్ యువ‌గ‌ళం వైసీపీ స‌ర్కారు అడ్డంకుల‌ను అధిగ‌మించి మ‌రీ 200 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. పోలీసుల కుయుక్తులు, అనుమతులు పేరుతో అడ్డ‌గింత‌లు, రోడ్డుపై మాట్లాడ‌కూడ‌దు, మైకు వాడ‌కూడ‌దు, జ‌నం గుమికూడ‌దు ఇన్ని ఆటంకాల‌ను శాంతియుతంగానే ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్నారు లోకేష్‌. గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం కత్తెరపల్లి గ్రామంలో 200 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది.  రెండు వారాల పాద‌యాత్ర‌లో ల‌క్ష‌లాది జ‌నాన్ని ప‌ల‌క‌రిస్తూ సాగుతున్నారు. వేలాది మంది క‌ష్టాలు వింటున్నారు. అయితే అస‌లు పాద‌యాత్ర జ‌ర‌గ‌డంలేద‌ని వైసీపీ దుష్ప్ర‌చారం చేసేందుకు త‌నకి అందుబాటులో ఉన్న సొంత మీడియా, కూలి మీడియాల‌ను విరివిగా వాడుతోంది. 200 కిలోమీట‌ర్లు దాటేస‌రికి లోకేష్‌పై న‌మోదైన కేసులు 20 దాటిపోయాయి. తాను అన్నింటికీ సిద్ధ‌మేనంటూ  ప్ర‌క‌టించిన లోకేష్‌, 400 రోజుల పాద‌యాత్ర‌లో రోజుకొక‌టి లెక్క త‌న‌పై 400 కేసులు పెట్టుకోమంటూ స‌వాల్ విసిరాడు. లోకేష్ పాద‌యాత్ర 200 రోజులు పూర్త‌య్యేస‌రికి, లోకేష్‌ని ల‌క్ష్యంగా చేసుకుని వైసీపీ త‌మ నేత‌ల‌తో పెట్టించిన ప్రెస్‌మీట్లు 200 దాటిపోయాయి. 17 రోజుల లోకేష్ పాదయాత్రని విమ‌ర్శిస్తూ 19 మంది  మంత్రులు, , 58 మంది ఎమ్మెల్యేలు, 138 మంది వైసీపీ నేత‌లు ప్రెస్ మీట్లు పెట్టారు. అయితే ఇంత‌మంది మాట్లాడారు కానీ.. పాద‌యాత్ర‌లో నారా లోకేష్ వేస్తున్న ప్ర‌శ్న‌ల‌కు ఒక్క‌రూ స‌మాధానం ఇవ్వలేదు. యువ‌గ‌ళంలో యువ‌నేత లోకేష్ చేసే ఆరోప‌ణ‌ల‌పైనా స్పందించ‌లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read