వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తోంది అని అంతా అనుకుంటున్నారు. ఇవి పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆత్మసాక్షి సర్వే ఇదే తేల్చేసింది. ఇవేవీ కాకుండా చాన్నాళ్లుగా మోగకుండా ఉన్న గంట ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలతో మోగింది. ఇదే తెలుగుదేశం విజయదుందుభికి అసలైన సంకేతం. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..ఏ పార్టీ అధికారంలో ఉంటుందంటే అందులో చేరతారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలితే అటువైపే ప్రయాణిస్తారు. టిడిపి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన నుంచీ గంటా టిడిపికి దూరంగా ఉన్నారు. ఇటీవల గంటా శ్రీనివాసరావు సొంతంగా చేయించుకున్న సర్వేలలో టిడిపి విజయం ఖాయమని అని తేలింది. అప్పటి నుంచీ పుట్టలోంచి పాము బయటకొచ్చినట్టు వస్తున్నారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఓటింగ్ సరళి చూసిన తరువాత గంటా తన సర్వేలు ఇవి ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకుని తెలుగుదేశం విజయంలో పాలుపంచుకుంటున్నారు. మీడియాతో కూడా మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ అని చెప్పుకొచ్చారు గంటా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రాష్ట్రం అంతా కనిపించిందన్నారు. మూడేళ్ల క్రితం 50శాతం పైగా ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందని వివరించారు. ఈ ఒరవడి చూస్తుంటే 2024లో టీడీపీదే విజయం అని, రాజధాని సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల విశ్వాసం లభించలేదు అని గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. అంటే 2024లో టిడిపి అధికారంలోకి వస్తుందని గంటా శ్రీనివాసరావు ఫిక్స్ అయ్యారు. ఇక యాక్టివ్ గా పనిచేస్తానని సంకేతాలు పంపారు.
తెలుగుదేశం గెలుస్తోంది..ఎలా? గంట మోగింది కదా!
Advertisements