ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ వైఎస్ చాన్స‌ల‌ర్ బ‌రితెగింపుపై విద్యావేత్త‌లు ముక్కున వేలేసుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక విశ్వ‌విద్యాల‌యాల‌న్నీ వైసీపీ కార్యాల‌యాలుగా మార్చేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఆంధ్రా యూనివ‌ర్సిటీ వీసీ ప్ర‌సాద‌రెడ్డి అయితే ఉత్త‌రాంధ్ర వైసీపీ వ్య‌వ‌హారాల అన‌ధికార ఇన్చార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. తాజాగా ఉత్తరాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ పాల్గొన‌డం, కాలేజీ యాజ‌మాన్యాల‌ను బ్లాక్ మెయిల్ చేయ‌డంపై ఫిర్యాదులు వ‌చ్చినా ప‌ట్టించుకోలేదు. అంత పేరు ప్ర‌ఖ్యాతులున్న ఆంధ్రా యూనివ‌ర్సిటీ వీసీ బ‌రితెగించిన‌ప్పుడు, తానేమీ త‌క్కువ తిన‌లేద‌ని నాగార్జున యూనివ‌ర్సిటీ వైఎస్ చాన్స‌ల‌ర్ ఏకంగా వైసీపీ నేత అవ‌తారం ఎత్తేశారు. వైకాపా 13వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఇటీవ‌ల జ‌రుపుకుంది. ఆ రోజున వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి ట్వీటేసి ఊరుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ రాజ‌శేఖ‌ర్ మాత్రం వ‌ర్సిటీలో వైకాపా ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రిపారు. వైఎస్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఆదివారం సెల‌వు కావ‌డంతో వైకాపా ఆవిర్భావ దినోత్స‌వాన్ని సోమ‌వారం జ‌రప‌గా రెక్టార్, రిజిస్ట్రార్ కూడా హాజ‌ర‌య్యారు. రాజ‌శేఖ‌ర్ తాను యూనివ‌ర్సిటీకి వీసీ కాద‌ని, వైకాపా వీసీన‌ని అనుకుంటున్న‌ట్టున్నార‌ని విద్యార్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇలా కొన‌సాగుతుండ‌గానే వైసీపీ కోసం కిరాయి తీసుకుని ప‌నిచేసే రాం గోపాల్ వ‌ర్మ‌ని తీసుకొచ్చి విశ్వ‌విద్యాల‌యాన్ని గ‌బ్బు ప‌ట్టించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అకడమిక్‌ ఎగ్జ్జిబిషన్ కి రాంగోపాల్ వ‌ర్మ‌ని అతిథిగా తీసుకొచ్చారు వీసీ. ఈ ఎగ్జిబిష‌న్ ప్రారంభించిన ఆర్జీవీ మాట్లాడుతూ ఏదైనా వైరస్‌ వచ్చి తాను తప్ప, మగజాతి అంతా అంత‌మైపోవాల‌ని, అప్పుడు నేనొక్కడినే స్త్రీజాతికి దిక్కవుతానంటూ చెప్పుకొచ్చాడు. కష్టపడి చదివేవారు ఎప్పుడూ పైకి రార‌ని, చ‌ద‌వ‌కుండా, హార్డ్‌వర్క్‌ చేయకుండా, ఉపాధ్యాయుల మాటలు పట్టించుకోకుండా ఇష్టానుసారం తాగుతూ తిరుగుతూ జీవించాలి’’ అని సూచించారు. ఇదే సంద‌ర్భంగా ఏఎన్ యూ వీసీ రాజశేఖర్‌ మాట్లాడుతూ రాంగోపాల్‌వర్మ ప్రొఫెసర్‌, ఫిలాసఫర్‌ కంటే ఎక్కువని, ఆయనకు పీహెచ్‌డీ, ఆస్కార్‌ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయని ప్రశంసించారు. నాగార్జున వర్సిటీలో ఆర్జీవీ వ్యాఖ్యలు, స‌మ‌ర్థించిన వీసీ తీరుపై యూజీసీ చైర్ పర్సన్, నేషనల్ ఉమెన్ కమిషన్ కు టిడిపి నేత వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read