ఒక నాయకుడు మీద నమ్మకానికి నిదర్శనం ఇది... ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే జరిగేది ఇది... చంద్రబాబు పరిపాలనా సత్తా ఏంటో చెప్పటానికి, మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ మరో ఉదాహరణ... మల్లవల్లి గన్నవరం దగ్గర ఉన్న, మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ లో మొత్తం 1260.06 ఎకరాల సువిశాల భారీ మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో 964 ప్లాట్లు ఉండగా, కేటాయింపులకు ముందే హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. 964 ప్లాట్లు ఉండగా, దాదాపు 20 శాతం అధికంగా దరఖాస్తులు అందాయి... అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్‌లోని పారిశ్రామిక సంస్థలు సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పారిశ్రామిక రంగాలు ఆసక్తి చూపించాయి...

cbn 08022018 2

ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ కోసం 100 ఎకరాలను ఏపీఐఐసీ అధికారులు కేటాయించారు. ఇందులో మొత్తం 125 ప్లాట్లు ఉన్నాయి. ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ అసోసియేషన్‌ తరపున 40 ఎకరాలను కేటాయించారు. ఇందులో 64 ప్లాట్లు ఉన్నాయి. నవ్యాంధ్ర అసోసియేషన్‌కు 51.96 ఎకరాలను కేటాయించారు. ఇందులో 126 ప్లాట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి చూస్తే.. 191.96 ఎకరాలను కేటాయించినట్టు అయింది. మొత్తంగా 315 ప్లాట్లు ఇవి దక్కించుకోబోతున్నాయి. ఇంకా పలు అసోసియేషన్లకు కేటాయించాల్సి ఉంది. వాటితో ఏపీఐఐసీ అధికారులు సంప్రదింపులు జరపాల్సిఉంది. దీంతో పాటు మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ఏపీఐఐసీ అధికారులు మహిళా పారిశ్రామిక పార్క్‌ (కోవె)కు తాత్కలికంగా 30 ఎకరాలను కేటాయించారు. ఇందులో మొత్తం 59 ప్లాట్లు ఉన్నాయి. ప్లాస్టిక్‌ ఇండస్ర్టీస్‌ కోసం 100 ఎకరాలను కేటాయించారు. ఇందులో మొత్తం 65 ప్లాట్లు ఉంటాయి.

cbn 08022018 2

మరోవైపు స్థానికంగానూ, వివిధ జిల్లాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపుగా ఇలాంటివి నాలుగు వందలకు పైగా దరఖాస్తులు ఉంటాయని తెలుస్తోంది. అశోక్‌ లేల్యాండ్‌కు ఇక్కడ 75 ఎకరాలను ఇటీవలే ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ ఇక్కడ రూ.135 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 2,295 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఏపీఐఐసీతో సేల్‌ అగ్రిమెంట్‌ చేసుకోవటమే మిగిలి ఉంది. మోహన్‌ స్పిన్‌టెక్స్‌ సంస్థకు ఇంటిగ్రేటెడ్‌ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటుకు 81 ఎకరాలను ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి ఫేజ్‌లో రూ.328.14 కోట్ల పెట్టుబడులు, రెండవ ఫేజ్‌లో రూ.275.85 కోట్ల వ్యయంతో యూనిట్‌ను ఈ సంస్థ అభివృద్ధి చేయాల్సి ఉంది. మొత్తంగా రెండు వేల మంది ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సంస్థ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. ఈ సంస్థ తనకు కేటా యించిన భూములకు డబ్బులు చెల్లించింది. రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ మిగిలి ఉంది. భారీ పరిశ్రమల కేటగిరిలో ఇవి పోను గోల్డ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనేక స్పి న్నింగ్‌ మిల్లులు, ఫార్మా కంపె నీలు ఆసక్తి చూపి స్తున్నాయి. ప్రభుత్వ స్థాయిలో సంప్రదింపలు చేస్తు న్నాయి. ఎంవోయూ దశలో ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read