అమరావతిలో, సియం నివాసం దగ్గర ఉన్న గ్రీవియన్స్ హాల్ లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది... సమావేశం ప్రారంభానికి ముందు రెండు నిమిషాలు మౌనం పాటించి సినీనటి శ్రీదేవి మృతికి తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం తెలిపారు... ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు... ఏమి జరిగిందో ఏమిటో అంటూ, ఆమె ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం అరుదైన అంశమని కొనియాడారు...
ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర మంత్రుల యనమల, సోమిరెడ్డి, లోకేశ్, కాల్వ శ్రీనివాసులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అందరి మధ్య 40 కిలోల కేక్‌ను కట్ చేశారు. కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు ఆధ్వర్యంలో 40 పావురాలను ఎగురవేశారు.
సమావేశంలో భాగంగా అఖిలసంఘాల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది... కేంద్రం పై వివిధ పార్టీలు, సంఘాలు పోరాడుతున్న నేపధ్యంలో, వారందరినీ కూర్చోపెట్టి, కేంద్రం పై ఎలాంటి వ్యుహ్యంతో వేళ్ళలో చర్చించనున్నారు... అలాగే, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు... ఇవి బడ్జెట్ సమావేశాలు కావటంతో, జాగ్రత్తలు చెప్పనున్నారు... ఈ సారి కూడా వైసిపీ రాకపోతే, ఎలాంటి వ్యుహ్యంతో వెళ్ళాలి, బీజేపీ ఎమ్మల్యేలు గోల చేస్తే, ఎలా డీల్ చెయ్యాలి అనే అంశాలు చర్చిస్తారు...