తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీ, 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.. జనసేన పార్టీ నిర్మాణం జరగక పోయినా, పవన్ మాత్రం తెలుగుదేశం పార్టీ తరుపున, బీజేపీ పార్టీ తరుపున, ప్రచారం చేసారు... అయితే, గత కొంత కాలంగా, బీజేపీ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తెలియచేసిన పవన్, అవకాసం దొరికినప్పుడు, తెలుగుదేశం పార్టీ పై కూడా విమర్శలు చేసారు... మరో పక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఉంటూ ఉన్నా, పార్టీల పరంగా, జనసేన, తెలుగుదేశం మాత్రం ఎప్పుడూ మిత్రపక్షంగా కనిపించ లేదు..
ఇది ఇలా ఉంటే, నిన్న ఒక ఇంటర్వ్యూ లో, జనసేనతో పొత్తు గురించి ప్రశ్నలు అడగగా, చంద్రబాబు స్పందించారు... జనసేన పార్టీతో పొత్తు అనేది, ఎన్నికలు వచ్చినప్పుడు నిర్ణయిస్తామని, అప్పటి రాజకీయ పరిస్థితులని బట్టి, పొట్టు ఉంటుంది అని, ఇప్పటికిప్పుడు జనసేనతో పొత్తు ఉంటుందా, ఉండదా అనే ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేము అని చంద్రబాబు అన్నారు... చంద్రబాబు ఇలా వ్యాఖ్యలు చెయ్యటం వెనుక, పవన్ కళ్యాణ్, టిడిపితో మిత్రపక్షంగా లేరు అనే విషయం అర్ధమవుతుంది.... అదే విధంగా భవిష్యత్తు పొత్తుల పై ఇంకా ఏమి తేలలేదు అని విషయం స్పష్టమవుతుంది...
మరో పక్క, వచ్చే ఎన్నికల్లో ప్రజా అజెండా ఎవరైతే అమోదిస్తారో వారితో జతకట్టి అడుగులు వేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పవన్‌కల్యాణ్ కూడా తమ ఆలోచనా విధానంలోనే నడుస్తున్నారని... ఆయనతో కలిసి నడిచే ఆలోచనలో ఉన్నామన్నారు. కడపలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నామని.. అనంతరం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు దేశంలో, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించి ఒక అవగాహనకు వస్తామన్నారు. కూటమిలో ఎవరు ఉండాలనేది, ఎవరెవరితో కలిసి ముందుకు వెళ్లే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు.