తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యక్తిగత జీవితం గురించి మీకు తెలిసిందెంత!? అసలేం తెలీదంటారా... 40 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని పురస్కరించుకుని, కొన్ని ఛానల్స్ లో ప్రసారమైన చంద్రబాబు మొదటి సారి ఓపెన్ అప్ అయ్యారు. ఎప్పుడూ గంభీరంగా, గుంభనంగా ఉండే చంద్రబాబు తన గత స్మృతులను తట్టి లేపారు. అచ్చంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని మనముందు ఉంచారు. తన చిన్నతనంలో ఆడుకున్న ఆటల దగ్గర నుంచి కాలేజీ డేస్, పెళ్ళి, రాజకీయ జీవితం వరకూ ఎవరికీ తెలియని ఎన్నో సంఘటనలను ఆయనే స్వయంగా వెల్లడించారు.
క్యాంపస్‌లో గ్యాంగ్వార్లు, సైకిల్షాప్లో మీటింగ్‌లు, ఛాయ్ తాగుతూ వీధుల్లో బలాదూర్‌గా తిరగడం, బైక్ సైలెన్సర్ ఊడబీకి బాతాఖానీలు, ఎమ్మెల్యేగా పోటీ చేయడం, వైఎస్‌తో స్నేహం, భువనేశ్వరితో పెళ్ళి, పెళ్ళికి ముందు వారేం మాట్లాడుకున్నారు, పెళ్ళి తర్వాత వారి వ్యక్తిగత జీవితంలో చిలిపి తగాదాలు, చిన్నచిన్న వివాదాలు, కుమారుడితో అనుబంధం, ఎన్టీఆర్‌ను మొదట ఎప్పుడు కలిసిందీ, ఆయనతో తన అనుబంధం, 1994 ఆగస్టు సంక్షోభం, ముఖ్యమంత్రిగా తనకు కలుపుగోలు తనం లేదని సోదాహరణంగా వివరించడం వంటి ఎన్నెన్నో అంశాలు స్వయంగా బాబు నోటి వెంట ఉల్లాసంగా జాలువారాయి.
అయితే స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి చంద్రబాబు ఆసక్తికర విషయం చెప్పారు.. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్ని వేషాలు వేయాలో అవి అన్నీ చేశానని, కానీ ఒక్కటి మాత్రం చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. .. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు అన్నీ ఈజీగా తీసుకున్నా. అందువల్లే ఇంటర్ ఫస్టియర్ ఫెయిలయ్యా. ఆ తర్వాత తిరుపతి వెళ్లి చదివా. అక్కడ నుంచి అన్నీ విజయాలే. విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్ని వేషాలు వేసినా, సిగరేట్ మాత్రం తాగలేదని చంద్రబాబు చెప్పారు..