మన రాష్ట్రంలో బీజేపీ నేతలు, అయ్యో రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది అంటూ, హైదరాబాద్ స్టూడియోల్లో కూర్చుని ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు... మరో పక్క, ఇప్పటికే కృష్ణా నది నుంచి సరిపాడా నీరు రాక, పట్టిసీమ అని, అది అని, ఇది అని, కిందా మీద పడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలో నీటి కష్టాలు లేకుండా, జాగ్రత్తలు తీసుకుని, ఈ మధ్య కాలంలో ఎప్పుడూ రానన్ని నీరు రాయలసీమకు ఇచ్చారు.... మరో పక్క, ఇవే నీరు చూపించి, కియా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా, రాయలసీమకు వచ్చేలా చేసారు చంద్రబాబు... అయితే, ఇప్పుడు కర్ణాటక బీజేపీ తీసుకున్న నిర్ణయం, రెండు తెలుగు రాష్ట్రాల పై, పిడుగు లాంటి వార్త అయ్యింది..

karnataka bjp 28022018

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కృష్ణానది పై నిర్మించిన ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బి.ఎ్‌స.యడ్యూరప్ప ప్రకటించారు.... అంటే ప్రస్తుతం, 120 టియంసీలుగా ఉన్న డ్యాం కెపాసిటీ, 200 టియంసీలకు చేరుకుంటుంది... ఇప్పుడున్న పరిస్థుతుల్లోనే నీరు మన రాష్ట్రానికి రావాలి అంటే, అక్టోబర్, నవంబర్ అవతుంది... మరి ఇంకా ఎత్తు పెంచితే, ఇక కృష్ణా నది అనేది ఒకటి ఉంది అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోవాల్సిందే... ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర నష్టం వచ్చేలా, ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకుంది కర్నాటక బీజేపీ...

karnataka bjp 28022018

మరి రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది, చంద్రబాబు ఏమి పట్టించుకోవటం లేదు, అని ఎగిరిన రాష్ట్ర బీజేపీ నేతలు, ఇప్పుడేమంటారు ? మీ యడ్యూరప్పని ఎదిరించే ధైర్యం ఉందా ? ఇలాంటి ప్రకటన, ఆలోచన చెయ్యవద్దు అని, మా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని, అమిత్ షా తో చెప్పే దమ్ము ఉందా ? మా రాయలసీమ మట్టి కొట్టుకుపోతుంది అని, మీ సొంత బీజేపీ నేతలతో పోరాడే ధైర్యం ఉందా ? లేకపోతే దీన్ని కూడా సమర్ధిస్తారా ? చంద్రబాబు పట్టిసీమ కట్టాడు, ఇంకా కృష్ణా నదితో పని ఏంటి, అని సోము వీర్రాజు వచ్చి అంటాడా ? ఎందుకంటే నిన్న హోదా ఎందుకు, ఇన్ని కంపెనీలు వస్తుంటే అన్నాడుగా... అదే లాజిక్ ప్రకారం, కృష్ణా నదిని, కర్ణాటకకు దానం చేద్దాం అంటాడా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read