దక్షిణ కొరియాలోని సియోల్‌కు చెందిన ప్రపంచ శ్రేణి కార్ల దిగ్గజ సంస్థ కియా భారతదేశంలో తొలిసారిగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కార్ల తయారీ కేంద్రం ప్రస్థానానికి తొలి అడుగు పడుతోంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి (అమ్మవారిపల్లి) గ్రామంలో 44వ జాతీయ రహదారి పక్కన నెలకొల్పుతున్న కియా కంపెనీకి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.13వేల కోట్ల వ్యయంతో 600 ఎకరాల విస్తీర్ణంలో హూండయ్ సంస్థ అనుబంధంతో ఏర్పాటు చేస్తున్న కియా కార్ల ఉత్పత్తి కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 13 వేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
2017 జూన్‌లో కియా కంపెనీకి అవసరమైన భూమి పనులు మొదలయ్యాయి. 2019 ద్వితీయార్ధంలో కార్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఏడాది సెప్టెంబర్ నాటికి తొలి కారు ఉత్పత్తి చేయడానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ఏడాదికి దాదాపు 3 లక్షల కార్లు తయారు చేయాలన్నది కియా సంస్థ లక్ష్యం. అలాగే టౌన్‌షిప్, అనుబంధ సంస్థలు, శిక్షణ సంస్థ తదితరాలను మరో 1200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. కియాకు కేటాయించిన 600 ఎకరాల్లో దాదాపు 550 ఎకరాల్లో గ్రౌండ్‌వర్క్ పూర్తయింది.
నాలుగు రాష్ట్రాల పోటాపోటీ... కియా మన దేశానికి రావాలని నిర్ణయించుకున్నాక ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలు కూడ పోటీ పడ్డాయి. అభివృద్ది చెందిన గుజరాత్, ఆటోమొబైల్ రంగంలో ముందున్న మహారాష్ట్రను కాదని మన రాష్ట్రానికి తీసుకురావడం చంద్రబాబు మరో (కీలక) విజయం.... మూడు జిల్లాల మధ్య పోటీ... నెల్లూరు, చిత్తూరు, అనంతపురంలలో భూమి లభ్యత, రోడ్, విమాన సౌకర్యాల దృష్ట్యా అనంతపురం వైపు మొగ్గు. కాని గొల్లపల్లి రిజర్వాయర్ లో కృష్ణా జలాలు లేక పోవడంతో చెప్పిన టైం కంటే వేగంగా రిజర్వాయర్ ను నింపిన అధికారులు....
భూమి సేకరణ... వివిధ దశలలో.. మొదట 475 ఎకరాలు, తరువాత 600 ఎకరాల భూ సేకరణను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులను ఒప్పించి, మంచి ధరను చెల్లించి వేగంగా చదును చేసి కియాకు అప్పగించిన కలెక్టర్లు, ఇతర అధికారులు.... కియా వేగం... ముఖ్యమంత్రి, ప్రభుత్వం, స్థానిక అధికారులు, అర్ధం చేసుకొని సహకరించిన రైతులు.. ఇవన్నీ చూసి కియా సైతం అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయడానికి నిర్మాణంలో వేగం పెంచింది. రివైజ్డ్ టార్గెట్ ప్రకారం 2019 దీపావళికి (ముందుగా అనుకున్నది 2022కు) దేశంలోని రోడ్లపై ‘అనంతపురం కియా’ కార్లు. అంతే కాదు కియా పరిశ్రమలన్నిటిలోకి టెక్నాలజీ పరంగా కార్ల తయారీ సంఖ్య పరంగా అతి పెద్ద పరిశ్రమ.