13 వేల కోట్ల పెట్టుబడితో ఒక కంపెనీ వచ్చింది అంటే మాటలా ? అదీ అనంతపురం లాంటి చోటుకి... ఎంత కృషి దీని వెనుక దాగుందో తెలుసా ? సీమలోనే అతి పెద్ద పరిశ్రమగా భావిస్తున్న కియా కార్ల తయారీ పరిశ్రమను, తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా అధికారుల కృషి ఎనలేనిది... కియా భారత్‌ వైపు చూస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఏర్పడింది... అయినా ముఖ్యమంత్రి తనదైన శైలిలో అన్ని వసతుల కల్పనకు అభయం ఇవ్వడంతో కల సాకారమైంది. ఎలాగైనా కియా అనంతకే రావాలని అధికారులు కూడా శ్రమించారు. కియా యాజమాన్యం తమకు ఫలానా వసతులు కావాలని అడగడమే తరువాయి.. చక్కటి ప్రణాళికతో వీరు పరుగులు పెట్టారు. ఇప్పుడు శరవేగంగా అడుగులు పడి.. గురువారం ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ వేడుక జరిగింది...

cbn 23022018 5

ఈ సందర్భంగా, కియా ప్రెసిడెంట్ పార్క్‌, చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు... ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు. దూరదృష్టితో పాలనను అందిస్తున్నారని కొనియాడారు. ‘‘ఆసియాలోనే మాది అతి పెద్ద ఆటోమొబైల్‌ పరిశ్రమ. 180 దేశాల్లో మా కంపెనీ కార్ల విక్రయాలు జరుగుతున్నాయి. గత రెండేళ్ల కిందట సీఎం చంద్రబాబుతో సంప్రదింపులు జరిపాక .. అనంతపురంలో కియ కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆయన చొరవ కారణంగానే దేశంలో మొట్ట మొదటిసారిగా మా కార్ల తయారీ ప్లాంటును స్థాపించగలిగాం" అని అన్నారు...

cbn 23022018 4

అలాగే, ముఖ్యమంత్రి చంద్రబాబుపై కియా ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు... పెట్టుబడులు ఆకర్షించడంలో ఆయన దిట్టగా అభివర్ణించారు... చంద్రబాబు చొరవ చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ప్రతిపాదనలు ఇచ్చిన వెంటనే,.... చకచకా అన్ని రకాల అనుమతులు, భూకేటాయింపులు జరిపారని చెప్పారు... ఆ వెంటనే త్వరితగతిన కార్ల ఉత్పత్తిని చేపట్టాలంటూ రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి పెంచిందన్నారు... ఈ హడావుడిలో భూమి పూజ అట్టహాసంగా చెయ్యలేకపోయామన్నారు... ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే 13 వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read