ముందుగా, ఒక రెండు సంవత్సరాలు వెనక్కు వెళ్దాం... అమరావతి శంకుస్థాపన రోజు, 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరుపున చంద్రబాబు గారి స్టేజి మీద నుంచి, మోడీ గారి వైపు తిరిగి "సార్... మేము దగా పడ్డాం... నడి రోడ్డు మీదకు కట్టు బట్టలతో గెంటారు... మీరు ఆదుకుంటాను అని మాటిచ్చారు... ప్లీజ్ సార్, మా ప్రజలందరి తరుపునా అడుగుతున్నా, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు మమ్మల్ని ఆడుకోండి సార్" అని చంద్రబాబు స్థాయి నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, మోడీని వేడుకున్నారు... ఆ సంఘటన చూసిన రోజున, మనస్సు చివిక్కు మంది... రాష్ట్ర ప్రజల బాగు కోసం, చంద్రబాబు అంతలా బ్రతిమిలడారు.. చివరకు ఏమి చేసారు ? ఇప్పుడు మన హక్కుల కోసం, పోరాడుతుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు ఎంత నీచ్చానికి దిగాజరారో తెలుసా ?

bjp 23022018 2

మరో మారు రాష్ట్ర విభజన కు బీజం వేస్తున్నారు బిజెపి... అధికారం కోసం ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న మోసం కప్పి పుచ్చుకోవడానికి ప్రజలను, ప్రాంతాల వారీగా విభజన బీజాలు నాటడానికి, ప్రయత్నాలు మొదలు పెట్టారు... రాయలసీమ డిక్లరేషన్ అంటూ, ఈ రోజు కొంత మంది బీజేపీ నేతలు కర్నూల్ లో కూర్చుని, రాయలసీమకు ఏమి చేసారు, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, రెండో రాజధాని పెట్టాలి అంటూ కొన్ని తీర్మానాలు చేసి, అక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మొదలు పెట్టారు... మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రజల ఆగ్రహాన్ని డైల్యూట్ చేయడానికి మీరు ఎంచుకున్న మార్గం చాల ప్రమాదకరం... గతం లో కాకినాడా తీర్మానం లో ఒక ఓటు రెండురాష్ట్రాలు అని విభజన వాదానికి బీజం వేశారు... మళ్ళీఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సహాయమందించకపోగా ఇప్పుడు మల్లి విభాజన బీజాలు వేయడానికి మీరు ప్రయత్నంచేస్తున్నారు... ఒక జాతీయ పార్టీ ఇంత దిగజారుడుతనం ప్రదర్శించడం సిగ్గుచేటు...

bjp 23022018 3

కానీ ఆంధ్రులు మీలాంటి కపట మనుషుల పార్టీల ఆలోచనలు తెలుసుకోలేని వారు కాదు... మీలాంటి రాష్ట్ర ద్రోహులను తరిమి కొడుతారు... రాయలసీమకు నిన్ననే దేశంలోనే అతి పెద్ద పెట్టుబడితో వచ్చిన కియా పనులు మొదలయ్యాయి... ఎప్పుడూ లేనంత నీరు రాయలసీమలో పారుతుంది... తిరుపతిలో మొబైల్ తయారే హబ్ ఏర్పడింది... మా ప్రజలకు ఏమి జరుగుతుందో అంతా తెలుసు... మీరు పాలించే అన్ని రాష్ట్రాల్లో రెండు రాజధానులూ రెండు అసెంబ్లీలూ పెట్టారా? అసలు అమరావతి రాజధానికే దిక్కు లేదు... రెండోది కట్టాలా? మీ మోడీ పకోడీలు అమ్మి డబ్బు పంపుతాడా? దక్షణ భారత నినాదాలు చేస్తుంటే, ఇలా మాట్లాడకూడదు అన్న మీరే, ఇలా ఎందుకు చేస్తున్నారు ? సర్దార్ వల్లభాయ్ పటేల్"నాడు సంస్థానాలని కలిపితే....ఆయన వారసులు అని చెప్పుకునే మీరు ప్రాంతీయతను రెచ్చగొట్టి పబ్బమ్ గడుపుకోవాలి అని చూస్తున్నారు,నిస్సిగ్గుగా... ఆంధ్రులుగా మా హక్కును అడిగితే ప్రాంతీయతను రెచ్చగొట్టి కుక్కలు చింపిన విస్తరి చెయ్యలనుకుంటారా?... కాంగ్రెస్ ఇలాంటి కపట నాటకాలు ఆడే, నాశనం అయిపొయింది... మీరెంత...

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read