గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డి, సాక్షి మీడియా, లోటస్ పాండ్ బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న, ఐఏఎస్ లు, ఐపీఎస్ ల పై, ఒక పధకం ప్రకారం దాడి చేస్తున్నారు... ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఖండిస్తున్నా సరే, పదే పదే కావాలని వారిని రెచ్చగొడుతున్నారు.... ఇలా ఒకసారి అధికారుల మీద ఏమన్నా వ్యాఖ్యలు చేస్తే, సహజంగా రాజకీయం నాయకులు వెనక్కు తగ్గుతారు, కాని ఇక్కడ మాత్రం, వారిని పదే పదే రొచ్చులోకి లాగుతున్నారు జే గ్యాంగ్... ఈ పరిణామాలతో అధికార వర్గాల్లో కూడా చర్చ మొదలైంది... రాష్ట్రం కోసం, పని చేస్తున్న అధికారులని, అంతు చూస్తా అనటం ఏంటి అంటి, ఒక సారి అయితే అనుకోవచ్చు, పదే పదే ఇలా అనటం, అభ్యంతరం అని, దీని పై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా స్పందించాలని కోరుకుంటున్నాయి...
అయితే, ఇలా చెయ్యటం వెనుకు, జే గ్యాంగ్ భారీ వ్యుహ్యం పన్నినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది... మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపైనే దాడి చేయడం ద్వారా ముఖ్యమంత్రిని బలహీనపరచాలి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని అయోమయంలో పడేయాలి. చివరకు వ్యవస్థలను స్తంభింపజేయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా ఉందని కొందరు ఉన్నతాధికారులు చెబుతున్నారు... పలు కేసుల్లో ఉన్న వ్యక్తి, పలువురి మీద కేసులు పడేందుకు కారణమైన వారు.. ఇప్పుడు అధికారులను బెదిరించడం వ్యవస్థను ఇబ్బందిలో పెట్టాలన్న ఎత్తుగడలో భాగమేనని అంటున్నారు. .
ప్రధానికి సైతం నోటీసులు రావడానికి కారణమైన వ్యక్తులు.. వ్యవస్థలో తమ పని తాము చేసుకునే ఉన్నతాధికారులను విమర్శించడం వెనక పాలనను స్తంభింపజేయాలన్న వ్యూహం ఉండి ఉంటుందని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి మాట వినకుండా సీఎంవో అధికారులను ఆత్మరక్షణలో పడేయడం, అదే సమయంలో కిందిస్థాయి సిబ్బంది సీఎంవో అధికారుల మాట ఖాతరు చేయకుండా చేయడం ఈ వ్యూహంలో భాగమని కొందరు అనుమానిస్తున్నారు.