బుందేల్ ఖండ్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరాల జల్లు కురిపించారు... రూ. 20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.... బుందేల్ ఖండ్‌కు ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీ ప్రకటించడంపై ఎవరికీ అభ్యంతరం ఉండదు... అయితే ఏపీ తమకు న్యాయం చేయాలని ఇంత ఆందోళన చేస్తున్నా... పట్టించుకోని మోదీ బుందేల్ ఖండ్‌కు మాత్రం ప్యాకేజీ ప్రకటించారు... ఇది ఏపీ ప్రజల్ని మరింత ఆగ్రహానికి గురుచేస్తోంది... తాము ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోని ప్రధాని బుందేల్‌కు ప్యాకేజీ ప్రకటించడం మరింత రగిలిపోయేలా చేస్తోంది...
లఖ్‌నవూలో పెట్టుబడుల సదస్సులో మోదీ ఈ ప్రకటన చేశారు. ఏపీలో విభజన హామీల అమలు కోసం ఉవ్వెత్తున ఆగ్రహావేశాలు ఎగిసిపడుతున్నాయి. తమకు కొత్తగా ఏమీ వద్దు... విభజన హామీలు అమలు చేస్తే చాలని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చాలని ఏపీ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోంది. లోక్‌సభలో ఎంపీలు ఆందోళనకు దిగి తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమని ప్రకటించారు. అయినా ఎప్పుడూ చెప్పే మాటలే మోదీ సర్కార్ చెప్పింది. ఎక్కడ నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేదు. ఉభయ సభల్లోనూ ప్రకటన చేసిన కేంద్రమంత్రులు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
ఇలాంటి సమయంలో బుందేల్ ఖండ్‌కు ప్రత్యేకంగా రూ. 20 వేల కోట్ల ఫ్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు ఇస్తామని ప్రకటించారు. ఆ లెక్కన రూ. 24 వేల 500 కోట్లు 7 జిల్లాలకు కలిపి రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రూ. 1050 కోట్లు మాత్రమే ప్రకటించి, ఇచ్చారు. అయితే హోదా వల్ల కలిగే రాయితి ప్రయోజనాలు కూడా ఇవ్వలేదు.... వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ అన్నారు. అదీ కనిపించలేదు. ఇదే సమయంలో బుందేల్ ఖండ్‌కు రూ. 20వేల కోట్ల ప్యాకేజీతో రక్షణ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లుగా లక్నో పెట్టుబడుల సదస్సులో మోదీ ప్రకటించారు. ఏపీ ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నా కేంద్రంలో చలనం లేదు.. తాజాగా బుందేల్ ఖండ్ ప్రకటన చుస్తే,కేంద్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టు కనిపిస్తుంది...