విజయవాడలో బుధవారం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల్లో గందరగోళం నెలకొంది. నేతల మధ్య భేదాభిప్రాయాల కారణంగా ఎమ్మెల్యే వంగవీటి రాధా అనుచరులు హంగామా సృష్టించారు .దీనికి గుడివాడ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశం వేదికైంది. సమావేశానికి హాజరైన మల్లాది విష్ణు అలకబూని వేదికపైకి వెళ్లేందుకు ససేమిరా అన్నారు. దీంతో వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, పార్ధసారధి ఎన్నిసార్లు పిలిచినా మల్లాది విష్ణు పైకి వెళ్లకుండా భీష్మించుకుపోయారు..స్వయంగా వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి బతిమాలినా ఫలితం లేకుండా పోయింది.
మరోవైపు వంగవీటి రాధా అనుచరులు నానా హంగామా సృష్టించారు. రాధాను సమావేశానికి ఎందుకు పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై రాధా, జై రంగా అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒకింత అసహనానికి గురైన మల్లాది విష్ణు..ఆపండయ్యా అంటూ వారించారు. రాధాని రెండు రోజులుగా పిలుస్తున్నామని, కాసేపట్లో వస్తారని సామినేని ఉదయభాను సముదాయించారు. మొత్తం మీద వంగవీటి రాధా ఆలస్యంగానైనా సమావేశానికి రావడంతో గందరగోళం సద్దుమణిగింది.
ఇప్పటికే రాధా, జగన్ వైఖరి పై గుర్రుగా ఉన్నారనే అభిప్రాయం ఉంది... పార్టీ మారుతున్నారు అనే ప్రచారం కూడా ఉంది... గౌతం రెడ్డి విషయంలో జగన్ ఆడిన డ్రామాలు, అలాగే రాధాకి సీట్ ఇవ్వకుండా, తప్పించే ప్లాన్ వెయ్యటం, రంగాను అన్ని తిట్టిన గౌతం రెడ్డిని బహిరంగంగా జగన్ కలవటం, ఇవన్నీ రాధాకు ఇబ్బందిగా మారాయి... టైం తీసుకుని, అడుగు వేస్తా అని ఇప్పటికే రాధా తన అనుచరుల దగ్గర ప్రకటించారు.. వైసిపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా, రాధా ఆక్టివ్ గా పాల్గునటం లేదు..