ఒక పక్క రాజీనామాలు, అవిశ్వాసం లాంటి సమస్యలతో, జగన్ రాజకీయంగా ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు మరో సమస్య వచ్చిపడింది... జగన్ కి మార్చి 23 టెన్షన్ పట్టుకుంది... రాజ్య‌స‌భ ఎన్నిక‌లకు గానూ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఈసీ) ఈ రోజు షెడ్యూల్ విడుద‌ల చేసింది. 16 రాష్ట్రాల నుంచి 58 రాజ్యసభ సీట్లకు గానూ వ‌చ్చేనెల 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 3 స్థానాలకు ఎన్నికలు జరుగతున్నాయి... అయితే, ఈ ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలో జగన్ కు అర్ధం కావటం లేదు... ఇప్పటికే నంద్యాల, కాకినాడలో చావు దెబ్బ తిన్న జగన్, ఇప్పుడు మరో ఇబ్బంది వచ్చింది...

jagan rs 23022018 2

ఇప్పటికే విజయసాయి రెడ్డి, అనేక డ్రామాలు మొదలు పెట్టాడు... మా ఎమ్మల్యేలను ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కొనేస్తున్నారు అనే ప్రచారం మొదలు పెట్టారు... అయితే జగన్ చేస్తున్న తప్పులతో, పార్టీ ఇప్పటికే నాశనం అయిపొయింది... గతంలో రాజ్యసభ సీటును ఎవరితో సంప్రదించకుండా 'జగన్‌'తో పాటు పలు కేసుల్లో నిందితుడు, ఆడిటర్‌ అయిన 'విజయసాయిరెడ్డి'కి ఇచ్చారని...అప్పుడు..పార్టీలోని ఇతర సమాజిక వర్గాలను గుర్తించకుండా..కేవలం తమకు సన్నిహితుడనే పేరుతో..ఆయనకు ఇచ్చారని..ఇప్పుడు కూడా అదే వర్గానికి ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఒంటెద్దు పోకడలతో 'జగన్‌' ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ఆక్షేపిస్తున్నారు.

jagan rs 23022018 3

పార్టీకి వచ్చే ఒక్క సీటును మళ్లీ 'రెడ్డి' సామాజికవర్గానికే ఇస్తే..మిగతా వర్గాలు ఏమి కావాలని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎస్సీ,ఎస్టీ,బిసీ,కాపులకు చెందిన నాయకులు గణనీయంగా ఉన్నారని..ఆ వర్గంలో ఎవరికో ఒకరికి ఇవ్వవచ్చు కదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు... నిజానికి, వైకాపాకు 44మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడిగా 'విపిఆర్‌' విజయం సునాయాసమే... అయితే...వీరిలో కొంత మంది ఇద్దరు ముగ్గురు పార్టీ ఫిరాయిస్తే పరిస్థితి ఏమిటి..? రాజ్యసభ సీటు ఇవ్వడమే..మా బాధ్యత.. గెలిపించుకోవాల్సిన బాధ్యత 'వేమిరెడ్డి'దే..అని 'విజయసాయిరెడ్డి' చెబుతున్నారట... అసలు విషయం మరి కొద్ది రోజులు గడిస్తే కానీ..ఎవరెరు పార్టీ నుంచి వెళ్లిపోతారు..ఎవరు ఉంటారో స్పష్టం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read